ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - May 04, 2020 , 01:50:52

రైతులు దిగులు చెందొద్దు

రైతులు దిగులు చెందొద్దు

  • ఆఖరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తది
  • అన్నదాతల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న కేసీఆర్‌
  • తాలు లేకుండా ధాన్యం తీసుకురావాలి
  • పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

పర్వతగిరి, మే 03: రైతులు దిగులు చెందొద్దని, పండించిన ఆఖరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు భరోసా ఇచ్చారు. పర్వతగిరి మండలం కల్లెడలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు. సెంటర్లలో సౌకర్యాలు తదితర అంశాలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ దేశం లో ఎక్కడా లేని విధంగా రైతులకు మద్దతు ధరను అందిస్తున్నది సీఎం కేసీఆరేనని అన్నా రు. అన్నదాతల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కరోనా కట్టడి చేయడంతోపాటుగా అన్నదాతకు అండగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం ముందు చూపుతో పనిచేస్తున్నదన్నారు. టోకెన్లు వచ్చిన రైతులే తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల నీటితో ఈ యే డాది అధిక దిగుబడులు వచ్చాయన్నారు. కరోనా కార ణంగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని, రూ. 30 వేల కోట్లు అప్పు తెచ్చి రైతులను ఆదు కుంటున్నదని చెప్పారు. అన్నదాతలు ప్రభుత్వానికి సహకరించాలని, రవాణా, గన్నీ బ్యాగులు, గిడ్డంగుల కొరత ఉన్నదని, లారీలు దొరకకపోతే ట్రాక్టర్లతో ధాన్యం రవాణా చేస్తున్నామని చెప్పారు. తాలు పేరుతో రైస్‌ మిల్లర్లు ఇబ్బందులు పెడితే శిక్షిస్తామని, రైతులు చైతన్యవంతులు కావాలని కోరారు. తాలు లేకుండా ధాన్యం తీసుకువస్తే రైతులకు ఇబ్బంది ఉండదని చెప్పారు. మండలంలోని బూరుగుమళ్ల గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రా న్ని ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ప్రారంభించా రు. అదేవిధంగా లాక్‌డౌన్‌తో సెలూన్‌ షాపులు మూతపడ్డాయని, తమను ఆదుకోవాలని నాయీబ్రాహ్మణులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. మంత్రి వెంట వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, డీసీసీబీ చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధా న కార్యదర్శి మురళి, ఎంపీపీ కమలాపంతు లు, జెడ్పీటీసీ సింగ్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మనోజ్‌కుమార్‌గౌడ్‌, వైస్‌ ఎంపీపీ రాజేశ్వర్‌రావు, మార్కెట్‌ డైరెక్టర్‌ ఏకాంతంగౌడ్‌,  మాజీ వైస్‌ చైర్మన్‌ ఏడుదొడ్ల జితేందర్‌రెడ్డి, సర్వర్‌, సర్పంచులు ఈర్యానాయక్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌, సోమేశ్వర్‌రావు, జనార్దన్‌రెడ్డి, శ్రీనివాస్‌, రా మ్మూర్తిగౌడ్‌, బాబు పాల్గొన్నారు. 

ఈ కష్ట కాలంలో గులాబీ దండు జనంతో ఉండాలి

‘టీఆర్‌ఎస్‌ శ్రేణులు మరోసారి సైనికులు కావాలి.. ఉద్యమ స్ఫూర్తితో కరోనా వైరస్‌ నిర్మూలనోద్యమంలో పాల్గొనాలి’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. ఆదివారం పర్వతగిరి మండల కేంద్రంలోని ఆయన స్వగృహం నుంచి మంత్రి సత్యవతి రాథోడ్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మె ల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, పెద్దపల్లి, భూపాలపల్లి జెడ్పీ చైర్మన్లు పుట్ట మధు, జక్కు శ్రీహర్షిణి, ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలతో  టెలీ కాన్పరెన్స్‌ నిర్వ హించి మాట్లాడారు. ఈ కష్ట కాలంలో గులాబీ దండు జనంతో ఉండాలని, పార్టీ క్యాడర్‌ వారికి అం డదండగా అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న భరో సాను రైతులకు ఇవ్వాలని సూచించారు. ఉద్యమ పార్టీ కార్యకర్తలుగా మన కర్తవ్యాన్ని మనమే నిర్దేశించు కోవాలని, సీఎం కేసీఆర్‌, ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు వివరించే బాధ్యతను మనమే తీసుకోవాలని సూచించారు. భౌతిక దూరం పాటిస్తూనే సామాజిక బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాలని, పేదలకు అన్నం పెట్టాలని.. అన్నదాతకు వెన్నుదన్నుగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పిలుపునిచ్చారు. రైతు బంధు సమితి సమన్వయ కర్తలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు.


logo