బుధవారం 20 జనవరి 2021
Warangal-rural - May 01, 2020 , 02:17:31

పేదల కోసం ఆర్థిక సాయం

పేదల కోసం ఆర్థిక సాయం

  • దాస్యంకు రూ. 5లక్షల చెక్కు అందించిన కార్పొరేటర్‌ గణేశ్‌

 మట్టెవాడ/నయీంనగర్‌, ఏప్రిల్‌ 30 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలను ఆదుకోవడానికి గ్రేటర్‌ వరంగల్‌ 27వ డివిజన్‌ కార్పొరేటర్‌ వద్దిరాజ్‌ గణేశ్‌ ముందుకొచ్చారు. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్‌విప్‌ దా స్యం వినయ్‌భాస్కర్‌కు హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన రూ.ఐదు లక్షల చెక్కు అందజేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో కార్పొరేటర్‌ వద్దిరాజు గణేశ్‌ పోతనరోడ్డు మురళీకృష్ణ మందిరం సమీపంలో పేదలు, పాపయ్యపేటచమన్‌లో బీహార్‌ వలస కూలీలకు సరుకులు అందజేశారు. ఆర్యవైశ్య వాసవీ మాత పరపతి సంఘం ఉపాధ్యక్షుడు కొత్త వెంకటకృష్ణ, మాధవి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా 25వ డివిజన్‌ శానిటేషన్‌ కార్మికులు, స్థానికులకు సరుకులు అందజేశారు. గ్రేటర్‌ 49వ డివిజన్‌లోని ఎక్సైజ్‌ కాలనీ కమిటీ ఆధ్వర్యంలో పారిశుధ్య సిబ్బందికి వినయ్‌భాస్కర్‌ సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ కేశబోయిన అరుణ, సుబేదారి సీఐ అజయ్‌ పాల్గొన్నారు. 


logo