మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - May 01, 2020 , 02:13:16

లాక్‌డౌన్‌లో ఉపాధి

లాక్‌డౌన్‌లో ఉపాధి

  • మాస్కుల తయారీలో మహిళలు
  • రోజుకు రూ.400 చొప్పున ఆదాయం
  • జీడబ్ల్యూఎంసీ వినూత్న కార్యక్రమం

వరంగల్‌, నమస్తే తెలంగాణ : లాక్‌డౌన్‌లోనూ మహిళలకు ఉపాధి దొరికింది. గ్రేటర్‌ పరిధిలో 400 మహి ళా సంఘాల సభ్యులు మాస్కుల తయారీలో బిజీబిజీగా ఉన్నారు. ఒక్కో మహిళ రోజుకు 100 మాస్కులు తయారు చేస్తూ రూ.400 ఆదాయం సంపాదిస్తోంది. 15 రోజులుగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలు మాస్కు లు తయారు చేస్తున్నారు. ఒక్కో మాస్కుకు కార్పొరేషన్‌ అధికారులు రూ.4 చెల్లిస్తున్నారు. ఇలా తయారైన మాస్కులను గ్రేటర్‌ అధికారులు ఇంటికి రెండు చొప్పు న పంపిణీ చేయనున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ వినూత్న కార్యక్రమానికి బల్దియా శ్రీకారం చుట్టింది. గ్రేటర్‌ పరిధిలోని కరోనా ప్రభావిత ప్రాంతాలను మొదటి ప్రాధాన్యతగా గుర్తించి మాస్కులను అందజేస్తున్నారు. ఇంటింటికీ మాస్కులు అందజేస్తున్న తొలి కార్పొరేషన్‌గా జీడబ్ల్యూఎంసీ రికార్డు సృష్టించనుంది. 

రూ.40 లక్షల ఖర్చు..

మాస్కుల తయారీకి కావాల్సిన క్లాత్‌ను కార్పొరేషన్‌ అధికారులు సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకు 22,900మీటర్ల క్లాత్‌ను కొనుగోలు చేసి మహిళా సం ఘాలకు అప్పగించారు. మీటరు క్లాత్‌తో 8 మాస్కులు తయారవుతున్నాయని అధికారులు చెప్పారు. 1,82,024 మాస్కుల తయారీకి కావాల్సిన క్లాత్‌ కొనుగోలు చేశామని, మరో 1,82,024 మాస్కు ల కోసం క్లాత్‌ కొనుగోలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ లాక్‌డౌన్‌ కాలంలో మహిళలకు మరో 20 రోజుల వరకు ఉపాధి దొరుకుతుందని వారు పేర్కొంటున్నారు. ఒక్కో మాస్కు తయారీకి రూ.11 ఖర్చు వస్తోంది. 3.60 లక్షల మాస్కుల తయారీకి సుమారు రూ.40 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. 

ఇప్పటి వరకు 1,02,183 తయారీ..

15 రోజులుగా సుమారు 400 మంది మహిళలు మాస్కుల తయారీలో బిజీబిజీగా ఉన్నారు. గ్రేటర్‌ పరిధిలోని 1,87,399 గృహాలకు రెండు చొప్పున మాస్కులు తయారు చేయిస్తున్నారు.  తొలి విడుత 1,82,024 మాస్కులు తయారు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు 1,02,183 మాస్కులను సిద్ధం చేసిన మహిళలు కార్పొరేషన్‌ అధికారులకు అందజేశారు.

3.60 లక్షల మాస్కులు లక్ష్యం..

గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 3.60 లక్షల మాస్కులను పంపిణీ చేయాలన్న లక్ష్యం తో కార్పొరేషన్‌ అధికారులు ఉన్నారు. గ్రేటర్‌లో 1,87,339 అసెస్‌మెంట్లు ఉన్నాయి. అందులో కొన్ని ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయి. ప్రతి ఇంటికీ రెం డు చొప్పున 3.60 లక్షల మాస్కులను సిద్ధం చేసి దశ ల వారీగా అందజేయనున్నారు. ఇప్పటికే నగరంలోని 15 నో మూవ్‌మెంట్‌ జోన్లలో ఇంటికి రెండు మాస్కు ల చొప్పున పంపిణీ ప్రక్రియ కొనసాగుతోంది. నోమూవ్‌మెంట్‌ జోన్లలో కార్పొరేటర్ల సహకారంతో బల్దియా సిబ్బంది సుమారు 60 వేల మాస్కులు పంపిణీ చేశారు. మలి దశలో 58 డివిజన్లలోని ప్రతి ఇంటికీ రెండు మాస్కులను అందించనున్నారు.

రూ.400 సంపాదిస్తున్నా..

 లాక్‌డౌన్‌లో పనిలేక ఇబ్బంది పడిన. కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో మా స్కుల తయారీతో ఉపాధి దొరికింది. రోజు కు సుమారు వంద మా స్కులను కుడుతూ రూ. 400 సంపాదిస్తున్నా. 15 రోజులుగా మాస్కులు కుడుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నా. మాస్కులు కుట్టి మహిళా సమాఖ్యలకు అందజేస్తున్నా. మరో రెండు రోజుల్లో కుట్టిన మాస్కులకు డబ్బులు చెల్లిస్తామని కార్పొరేషన్‌ అధికారులు చెప్పారు. 

 -జీ శబరి,చింతగట్టు