సీఎంఆర్ఎఫ్కు ఏపీజీవీబీ విరాళం

- మంత్రి కేటీఆర్‌కు రూ. 45.31లక్షల డీడీ అందజేత
హన్మకొండ, నమస్తే తెలంగాణ, ఏప్రిల్ 30 : కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల విజయవంతానికి తమ వంతు సహాయంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు (ఏపీజీవీబీ) సిబ్బంది సీఎం సహాయ నిధికి రూ.45,31,396 విరాళంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించిన డీడీని గురువారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ప్రగతి భవన్లో బ్యాంక్ చైర్మన్ కే ప్రవీణ్‌కుమార్ అందజేశారు. ఆయన వెంట సెక్రటరీ జనరల్ ఎస్ వెంకటేశ్వర్‌రెడ్డి, బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎన్ ప్రకాశం, బ్యాంకు ఉద్యోగుల సం ఘం ప్రధాన కార్యదర్శి కే భిక్షమయ్య, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కే వినోద్‌రెడ్డి ఉన్నారు. ఈ సం దర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో తెలంగాణ ప్రభుత్వం కష్టపడి పనిచేస్తున్నదని, ఈ సందర్భంలో బ్యాంకు ఉద్యోగులు, యూనియన్లు అన్న తేడాలేకుండా ప్రభుత్వానికి తమ వంతుగా అండగా ఉండాలన్న ఉ ద్దేశంతో ఈ సాయం చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
- జై శ్రీరాం అంటే తప్పేంటి: నేతాజీ మనుమడు
- జగిత్యాల జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- దివ్యమైన ఆలోచన.. చంద్రకాంత్‌కు ఎఫ్‌టీసీసీఐ అవార్డు
- చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం
- 2,697 కరోనా కేసులు.. 56 మరణాలు
- శ్రీశైలంలో కార్మికశాఖ స్పెషల్ డ్రైవ్
- కేంద్ర సాయుధ పోలీసు దళాలకు ప్రత్యేక ఆరోగ్య పథకం
- ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ ఇమ్యూనిటీ ఇస్తుంది..?
- తమిళ సంస్కృతి ప్రధాని మోదీకి తెలియదు: రాహుల్
- ఎగ్ ఫేస్ మాస్క్‌తో ఎన్నో లాభాలు..