శుక్రవారం 15 జనవరి 2021
Warangal-rural - Apr 28, 2020 , 02:45:41

కార్యకర్తలే కథానాయకులు: దాస్యం

కార్యకర్తలే కథానాయకులు: దాస్యం

హన్మకొండ, నమస్తే తెలంగాణ : దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా పార్టీ కార్యకర్తలే కథానాయకులు, అన్ని పార్టీలకు హై కమాండ్‌ ఢిల్లీ ఉంటే, టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రం హై కమాండ్‌ సుశిక్షితులైన కార్యకర్త లు, ప్రజలేనని ప్రకటించిన గొప్ప నాయకుడు కేసీఆర్‌ అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్స వాన్ని పురస్కరించుకుని సోమవారం హన్మకొండ సుబేదారిలోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా, వినయ్‌భాస్కర్‌ హాజరై రక్తదానం చేశారు. వరంగల్‌ పశ్చిమ నియోజకర్గంలోని 20వేల మంది కార్యకర్తలకు నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసే కార్య క్రమాన్ని ప్రారంభించారు. హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రానికి నిత్యావసర సరుకులు అందజేశారు. పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు అయిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చిత్ర పటాలను బహూకరించారు. అంతేకాకుండా వినూత్నంగా రిక్షా పుల్ల ర్స్‌ ద్వారా ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ శ్రేణుల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని అన్నారు. నాటి ఉద్యమనాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ త్యాగాల పునాదులపై నిర్మించిన పార్టీ రాష్ట్ర సాధనలో అలుపెరుగకుండా ఉద్యమించిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, మాజీ ఎంపీ సీతా రాంనాయక్‌, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మన్‌ డాక్టర్‌ పీ విజయ్‌చందర్‌రెడ్డి, కార్పొరేటర్‌ దాస్యం విజయ్‌భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.