లాక్‌డౌన్‌కు సహకరించాలి

- వద్దిరాజు సోదరుల సేవాగుణం మరువలేనిది
- మంత్రి ఎర్రబెల్లి
- పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ
- మొండ్రాయి వద్ద చెక్‌పోస్టు పరిశీలన
కేసముద్రం రూరల్ : కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌కు మరికొద్ది రోజులు ప్రజలు సహకరించాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఆదివారం జిల్లా ఏరియా ఆస్పత్రిలో వైద్యులకు పీపీఈ కిట్ల పంపిణీ అనంతరం మండలంలోని కేసముద్రం విలేజ్ హరిహర గార్డెన్స్‌లో ఇనుగుర్తి గ్రామానికి చెందిన గాయత్రి గ్రానైట్స్ అధినేతలు వద్దిరాజు కిషన్, రవిచంద్ర సహకారంతో వారి తల్లిదండ్రులు వద్దిరాజు నారాయణ, వెంకటనర్సమ్మ జ్ఞాపకార్థం మండలంలోని 40 గ్రామాల నిరుపేద, వలస కూలీలు, మండల జర్నలిస్టులకు రూ.8 లక్షల విలువైన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఎంపీ మాలోత్ కవిత, కలెక్టర్ గౌతమ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలకు ఆర్థిక చేయూతనిస్తున్న వద్దిరాజు సోదరుల సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఇవేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షల విరాళం, ఖమ్మం జిల్లా కేంద్రంలో 500 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులను కూడా అందించారని మంత్రి గుర్తు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు వారి గ్రామాల్లో నిరుపేదలకు తగిన సాయం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. సామాజిక దూరం, స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయవచ్చని, తప్పనిసరి బయటకు వస్తే మాస్కులను ధరించాలని కోరారు. రైతులు పండించిన ప్రతి గింజనూ తప్పకుండా కొనుగోలు చేస్తామని, ఆధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో గాయత్రి గ్రానైట్స్ అధినేతలు వద్దిరాజు కిషన్, రవిచంద్ర, దేవేందర్, వెంకటేశ్వర్లు, రాష్ట్ర మార్క్‌ఫెడ్ డైరెక్టర్ మర్రి రంగారావు, జెడ్పీటీసీ శ్రీనాథ్‌రెడ్డి, ఎంపీపీ చంద్రమోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాపలాను కట్టుదిట్టం చేయాలి
కొడకండ్ల/దేవరుప్పుల : సూర్యాపేట జిల్లా లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదైన నేపథ్యంలో జనగామ-సూర్యాపేట సరిహద్దులో నిఘా పెంచి, కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మొండ్రాయి వద్ద ఏర్పా టు చేసిన చెక్‌పోస్ట్‌ను మంత్రి ఆదివారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేటతో పాటు కొడకండ్ల మండలానికి ఆనుకుని ఉన్న తిరుమలగిరిలో కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ఉన్నారని, తిరుమలగిరి నుంచి వచ్చే అన్ని దారులు మూసివేయాలని పోలీసులకు సూచించారు. మంత్రివెంట పాలకుర్తి సీఐ రమేశ్, జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, ఎంపీపీ జ్యోతి, సర్పంచ్ రాజ్‌కుమార్ ఉన్నారు.
తాజావార్తలు
- 'ప్రతీ జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు కృషి'
- 3,145 కరోనా కేసులు.. 45 మరణాలు
- పవన్ కళ్యాణ్‌కు ఇచ్చిన మాట కోసం మాటలు రాస్తున్న త్రివిక్రమ్
- శతాబ్ది ‘యూటర్న్’: తృణమూల్‌తోనే నేను
- శ్రీశైలంలో వైభవంగా మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
- ‘మాస్టర్’ 2 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్..100 కోట్ల వైపు పరుగులు
- రాహుల్ మొసలి కన్నీరు కారుస్తున్నారు: హర్సిమ్రత్ కౌర్
- పిస్టల్‌తో బర్త్‌డే కేక్ కట్: సోషల్ మీడియాలో వీడియో వైరల్
- ప్రజా వైద్యుడు రమక లక్ష్మణ మూర్తి కన్నుమూత
- ఇది సంక్రాంతి విజయం కాదు.. నిర్మాతలకు పెరిగిన నమ్మకం