సంక్షోభంలోనూ సంక్షేమంపైనే దృష్టి

- ప్రాణం విలువ తెలిసిన మహనీయుడు సీఎం కేసీఆర్
- ఆపత్కాలంలోనూ రైతులకు అండగా ఉండేందుకు కృషి
- సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలి
- రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి
- రాయపర్తి మండలంలో పర్యటించిన దయాకర్ రావు
రాయపర్తి, ఏప్రిల్ 23 : కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభమున్నా సంక్షేమంపైనే సీఎం కేసీఆర్ దృష్టి సారించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మనుషుల ప్రాణం విలువ తెలిసిన మహనీయుడు ముఖ్యమంత్రి అని కొనియాడారు. గురువారం ఆయన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని రాగన్నగూడెం, కొండూరు, కొలన్‌పల్లి గ్రామాల్లో పర్యటించారు. తొలుత రాగన్నగూడెంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న కొనుగోళ్ల తీరుతెన్నులు, అందుబాటులో ఉన్న హమాలీలు, గన్నీ సంచులు, మౌలిక వసతులు, సౌకర్యాలపై నిర్వాహకులు, రైతులతో వేర్వేరుగా ఆరా తీశారు. కొనుగోలు కేంద్రం సమీపంలో మక్కలు పడుతున్న యంత్రం పనితీరును పరిశీలించారు. అనంతరం కొలన్‌పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపత్కాలంలోనూ రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, రైతులు తాలు, తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కరోనా కట్టడి జరిగేంత వరకు సీఎం కేసీఆర్ విధించిన లాక్‌డౌన్‌ను ప్రతిఒక్కరూ పాటించాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు.
దాతలు ముందుకు రావాలి
కరోనా నేపథ్యంలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు దాతలు ముందుకు వచ్చి తోచినంత సాయం చేయాలని మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. మండలంలోని కొండూరు గ్రామంలో ఆటో డ్రైవర్లు, మత గురువులు, నిరుపేదలకు ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ నేతృత్వంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకపూట ఉపవాసం ఉండైనా సరే ప్రజల ప్రాణాలు కాపాడాలన్న దృఢ చిత్తంతో ఉన్న సీఎం కేసీఆర్‌కు సహకరించాలని కోరారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ ఆర్థిక సహకారంతో మండలంలోని కొండూరు, బురహాన్‌పల్లి, కొలన్‌పల్లి గ్రామాల రైతులకు మంజూరైన రాయితీ సబ్మెర్సిబుల్ మోటర్లు అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సురేందర్‌రావు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు బిల్లా సుధీర్‌రెడ్డి, కర్ర సరిత, రవీందర్‌రెడ్డి, రెంటాల గోవర్ధన్‌రెడ్డి, చిర్ర ఉపేంద్ర, వెంకన్న, ఆలకుంట్ల రాజేందర్, జక్కుల వెంకట్‌రెడ్డి, చిట్యాల వెంకటేశ్వర్లు, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో రాంమోహనాచారి, ఏవో గుమ్మడి వీరభధ్రం, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అనసూయ 'థ్యాంక్ యూ బ్రదర్ ' ట్రైలర్
- ఇక సెకన్లలోనే ఫుల్ మూవీ డౌన్లోడ్.. ఎలాగంటే?!
- మొబైల్ కోసం తండ్రిని చంపిన కూతురు
- వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిన సింధు
- కల్లుగీస్తుండగా ప్రమాదం..వ్యక్తికి గాయాలు
- ఫిబ్రవరి 2న సీబీఎస్ఈ ఎగ్జామ్స్ షెడ్యూల్
- 11 నెలలు..50 దేశాలు..70,000 కిలోమీటర్లు
- హెచ్1-బీ వీసా.. కొత్త వేతన నిబంధనల అమలు వాయిదా
- 20 నిమిషాలు..కోటి రెమ్యునరేషన్..!
- ప్రజలను రెచ్చగొట్టే టీవీ ప్రోగ్రామ్‌లను ఆపేయండి..