గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Apr 13, 2020 , 02:20:57

జనగామలో లాక్‌డౌన్‌ కఠినతరం

జనగామలో లాక్‌డౌన్‌ కఠినతరం

జనగామ, నమస్తే తెలంగాణ : పట్టణంలో రెడ్‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మున్సిపల్‌ ఆధ్వర్యంలో మొబైల్‌ వాహనాల ద్వారా కూరగాయలు సరఫరా చేస్తున్నారు. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగించడంతో ఆదివారం పోలీసులు నిబంధనలు మరింత కఠినం చేశారు.  నిబంధనలకు వి రుద్ధంగా సెలూన్‌ షాపులు తీసిన అభినాష్‌, లింగం, సంజీవ్‌, వీరేశ్‌కు  నాయీ బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 5వ వార్డు బాణాపురం ఇందిరమ్మకాలనీలో పేదలు, బీహార్‌ వలస కూలీలకు కౌన్సిలర్‌ దేవరాయి నాగరాజు ఆధ్వర్యంలో 40 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. 15వ వార్డులో బీజేపీ నాయకుడు కొత్తపల్లి సతీశ్‌ పేదలకు బియ్యం, నిత్యావసరాలు వితరణ చేయగా కౌన్సిలర్‌ బొట్ల శ్రీనివాస్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ నాగారపు వెంకట్‌, మాల మహాసభ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాటి కుమార్‌ అందజేశారు. అమ్మ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పలువురు దాతల నుంచి సేకరించిన బియ్యం, నిత్యావసర సరుకులను పేదలకు అందజేశారు. సాధిక్‌ ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో అత్యవసర సేవల్లో భాగంగా అంబేద్కర్‌నగర్‌, మైనార్టీ కాలనీ, సంజయ్‌నగర్‌ గుడిసెవాసులకు వాహన బంధు ద్వారా కూరగాయలను అందజేశారు. మర్యాల శ్రీనివాస్‌ సహకారంతో 29వ వార్డులో పలువురికి 16 రకాల సరుకులను గ్రీన్‌ జనగామ అధ్యక్షుడు సంతోష్‌ అందజేశారు. 


logo