ఒంటరితనాన్ని భరించలేక..

- కరోనాతో కుటుంబానికి దూరమైన వ్యక్తి ఆత్మహత్య
- అమెరికాలో ఉన్న కొడుకు వద్దే ఉండిపోయిన భార్య
- తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
- వీడియో కాల్లో చివరి చూపునకు నోచుకున్న వైనం
హసన్‌పర్తి, ఏప్రిల్ 12 : కరోనా కట్టడితో కుటుంబానికి దూరమై ఒంటరితనాన్ని భ రించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండల కేంద్రంలో వెలుగు చూసిం ది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం హసన్పర్తికి చెందిన కందుకూరి సూర్యనారాయణ (65)కు భార్య శాంతమ్మ, ముగ్గు రు సంతానం ఉన్నారు. వారిలో పెద్ద కుమారుడు రెండేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. మరో కుమారుడు కిరణ్ అమెరికాలో స్థిరపడ్డాడు. కుమార్తె కృష్ణవేణి హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నది. అమెరికాలో ఉంటున్న కిరణ్ రెండు నెలల క్రితం నూతన గృహ ప్రవేశం ఉండడంతో తల్లిదండ్రులిద్దరినీ ఆహ్వానించగా శాంతమ్మ ఒక్కతే వెళ్లింది. సూర్యనారాయణ తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో హసన్‌పర్తిలోనే ఉండిపోయాడు. దేశంలో లాక్డౌన్ ప్రకటించడంతో శాంతమ్మ అమెరికాలోనే ఉండిపోయింది. దీంతో ఒంటరితనం భరించలేక సూర్యనారాయణ ఈ నెల 8న ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. బంధువుల నుంచి విషయాన్ని తెలుసుకున్న కిరణ్ స్థానిక ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రావుకు తన తండ్రి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దర్యా ప్తు చేపట్టిన ఎస్సై ఈ నెల 9న వరంగల్ రూ రల్ జిల్లా రాయపర్తి మండల శివారులోని కెనాల్లో ఓ గుర్తు తెలియని శవం కొట్టుకొచ్చినట్లు తెలుసుకొని ఆ విషయాన్ని కిరణ్‌కు తెలిపారు. కిరణ్ ద్వారా సమాచారం తెలుసుకున్న స్థానిక టీఆర్ఎస్ నాయకులు కందుకూరి చంద్రమోహన్, పావుశెట్టి శ్రీధర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి సంఘటన స్థలంలోని ఫొటోలను పరిశీలించి మృతదేహం సూర్యనారాయణదిగా గుర్తించారు. అప్పటికే ఎంజీఎం మార్చురీలో ఉన్న సూర్యనారాయణ మృతదేహాన్ని ఆదివారం ఖననం చేసేందుకు ఎంజీఎం ఔట్‌పోస్టు పోలీసులు సిద్ధం కాగా, టీఆర్ఎస్ నాయకులు విషయాన్ని వివరించి మృతదేహాన్ని హసన్పర్తికి తరలించారు. సమాచారాన్ని అమెరికాలో ఉన్న మృతుడి కుటుంబ సభ్యులు, హైదరాబాద్‌లో ఉంటున్న కూతురుకు అందించా రు. అమెరికా నుంచి వారు అంత్యక్రియలకు రాలేకపోవడంతో కూతురు కృష్ణవేణి హైదరాబాద్ నుంచి వచ్చి ఆదివారం తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించగా, భార్య, కుమారుడు వీడియో కాల్ ద్వారా చూసి కన్నీటి పర్యంతమయ్యారు. తండ్రికి తలకొరివి పెట్టాల్సిన కుమారుడు కిరణ్, భర్త చివరి చూపులు చూడాల్సిన భార్య శాంతమ్మ లాక్‌డౌన్‌తో అమెరికాలోనే ఉండిపోవడం స్థానికులను కలిచివేసింది.
తాజావార్తలు
- పర్సనల్ వెహికిల్స్‌కూ ఫిట్నెస్ తప్పనిసరి చేయాలి: ఆర్సీ భార్గవ
- బేకింగ్ సోడా, డయాబెటీస్‌కి సంబంధం ఏంటి..?
- కనకరాజుకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
- ఆగని పెట్రో మంటలు
- ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభపెడితే రెండేళ్ల జైలు శిక్ష
- రవితేజ 'హల్వా డాన్స్' అదిరింది..వీడియో
- మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి గంగుల
- హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..