సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Apr 11, 2020 , 13:22:16

వరంగల్‌ సంక్షిప్త సమాచారం

వరంగల్‌ సంక్షిప్త సమాచారం

 • వరంగల్‌, నమస్తే తెలంగాణ :  నగరంలోని మండిబజార్‌, సాకరాశికుంట, కరీమాబాద్‌, పెరకవాడ, అండర్‌బ్రిడ్జి ప్రాంతాల్లో కమిషనర్‌ పమేలా సత్పతి తనిఖీలు చేశారు. అలాగే  బల్దియా జేఏసీ అధ్యక్షుడు గౌరీశంకర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని పారిశుధ్య కార్మికులకు వంటనూనె ప్యాకెట్ల్లు పంపిణీ చేశారు.  
 • హన్మకొండ నమస్తే తెలంగాణ : 38వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆలకుంట్ల వెంకన్న ఆధ్వర్యంలో అంబేద్కర్‌నగర్‌లో కూరగాయలు పంపిణీ చేశారు.   
 • పోచమ్మమైదాన్‌ : నిరుపేదలకు గ్రేటర్‌ కమిషనర్‌ నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. జాగృతి జిల్లా అధికార ప్రతినిధి సుశీల్‌గౌడ్‌ సిరి జ్యువెల్లర్స్‌ యజమానులు సత్యం, చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో 29వ డివిజన్‌లోని 350 కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కేఎంసీలోని వైరాలజీ ల్యాబ్‌ సిబ్బందికి  ఎస్‌ఎస్‌ ఫార్మా బ్రదర్స్‌ దూడం రమేశ్‌, సూరి ఆధ్వర్యంలో, దేశాయి పేట రోడ్డులో ఛత్రపతి శివాజీసేవా సమితి ఆధ్వర్యంలో, టీఆర్‌ఎస్‌ నాయకు రాలు ముష్కె ప్రమీల ఆధ్వర్యంలో నిరుపేదలకు సరుకులు పంపిణీ చేశారు. 
 • వేలేరు : కార్మికులకు కుడా డైరెక్టర్‌ యాదగిరి బియ్యాన్ని అందించారు.  
 • కరీమాబాద్‌ : ఏకే సోషల్‌ అండ్‌ చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ వొగిలిశెట్టి అ నిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  22వ డివిజన్‌లో జవాన్‌ సంపత్‌ సేవలకు గుర్తింపుగా కన్నతల్లి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు కొండమీది రాజన్‌బాబు ఆధ్వర్యంలో ఉర్సులో సత్కరించారు.  
 • వరంగల్‌ చౌరస్తా : తెలంగాణ హస్తకళల బోర్డు చైర్మన్‌ సంపత్‌కుమార్‌ ఆధ్వ ర్యంలో ఎంజీఎం ఆవరణలో 400 మందికి భోజన ప్యాకెట్లు, అలాగే నేతాజీ, వైకే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  200 మందికి అల్పాహారం పంపిణీ చేశారు.  
 • హసన్‌పర్తి : హసన్‌పర్తి పద్మశాలీ కాలనీలో బ్యాంకు రిటైర్డ్‌ మేనేజర్‌ 25  కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాలను అందజేశారు. 
 • ఖిలావరంగల్‌ : శంభునిపేట, మోమిన్‌పుర, గణేశ్‌నగర్‌లో రసాయనాలను పిచికారీ చేశారు. శివనగర్‌లోని శ్రీసాయి పరపతి సంఘం అధ్యక్షుడు శ్రీరాం రాజేశ్‌ ఆధ్వర్యంలో, 19వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు సతీశ్‌ ఆధ్వ ర్యంలో, 8వ డివిజన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పేదలకు సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు.
 • మట్టెవాడ : బిల్డర్‌ కే పాపిరెడ్డి ఆధ్వర్యంలో ఎర్ర రాంరెడ్డి, లింగమూర్తి వంద మందికి భోజన ప్యాకెట్లు, డాటన్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు జన్నపురెడ్డి సాం బరెడ్డి ఆధ్వర్యంలో 60 మందికి సరుకులు, బీఎస్‌కే జ్యువెల్లర్స్‌ ఆధ్వర్యంలో పుడ్‌ప్యాకెట్స్‌, వరంగల్‌ 24వ డివిజన్‌లో భద్రకాళీబండ్‌ ఆధ్వర్యంలో అన్నదా నం చేశారు.  25వ డివిజన్‌లోని  నోమూవ్‌మెంట్‌ జోన్‌తో పాటు, డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా రసాయనాలను పిచికారీ చేశారు.
 • వరంగల్‌ కల్చరల్‌ :  నిరాశ్రయులకు హన్మకొండ శ్రీషిర్డీ సాయిబాబా ధర్మకర్తమండలి ఆధ్వర్యంలో పులిహోర ప్యాకెట్లను పంపిణీ చేశారు.  
 • న్యూశాయంపేట : న్యూశాయంపేట మార్బుల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో  హమాలీలకు సరుకులను పంపిణీ చేశారు. అలాగే బీజేపీ డివిజన్‌ అధ్యక్షుడు పెరుగు సురేశ్‌ ఆధ్వర్యంలో ఇంటింటికీ కూరగాయలను పంపిణీ చేశారు. 
 • మిల్స్‌కాలనీ : సెంటినరీ బాప్టిస్ట్‌చర్చిలో సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నిరుపేద లకు సరుకులు  పంపిణీ చేశారు. 10వ డివిజన్‌ చింతల్‌లో ప్రదీప్‌, అస్లామ్‌, సందీప్‌ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • ఐనవోలు :  పెరుమాండ్లగూడెం, వెంకటాపురం గ్రామాల్లో సర్పంచ్‌ పిడుగు రజిత, ఎంపీటీసీ మాధవి నిరుపేదలకు నిత్యావసర సరుకులు, ఒక్కరికి రూ.500 చొప్పున పంపిణీ చేశారు.  
 • మడికొండ : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (హైదరాబాద్‌ సర్కిల్‌) ఆధ్వర్యంలో ములుగురోడ్‌ బ్రాంచి వద్ద పారిశుధ్య కార్మికులకు డిప్యూటీ జనరల్‌  సెక్రటరీ శంకర్‌ నిత్యావసర సరుకులు సమకూర్చగా గ్రేటర్‌ కమిషనర్‌ పమేలా సత్పతి పంపిణీ చేశారు.  
 • నయీంనగర్‌ : 54వ డివిజన్‌లోని వైద్య సిబ్బందికి, శానిటైజర్లు, మాస్కులను టీఆర్‌ఎస్‌  నాయకుడు  మణీంద్రనాథ్‌ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.  
 • నర్సంపేట, నమస్తేతెలంగాణ: పేదలకు నిత్యావసర సరుకులను గురువారం ఐద్వా జిల్లా కమిటీ కార్యదర్శి వంగాల రాగసుధ అందించారు. 
 • తొర్రూరు, నమస్తేతెలంగాణ : తొర్రూరు బార్‌ అసోసియేషన్‌, మండల న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో డివిజన్‌ కేంద్రంలోని నిరుపేద కుటుంబాలకు సివిల్‌ జడ్జి ఎం సరిత సరుకులను పంపిణీ చేశారు. తొర్రూరు చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంఘ అధ్యక్షుడు బిజ్జాల శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి మహేశ్‌ ఆధ్వర్యంలో తొర్రూరు డీఎస్పీ వెంకటరమణకు వెయ్యి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.  
 • మరిపెడ, నమస్తే తెలంగాణ :  5వ వార్డు కౌన్సిలర్‌ సుజాత నిత్యావసరాలు అందించగా, వాటిని  మరిపెడ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ సింధూర కుమారి కూలీలకు పంపిణీ చేశారు. డోర్నకల్‌ నియోజకవర్గానికి చెందిన పలువురు ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధుల ఆధ్వర్యంలో మరిపెడ సీఐ కరుణాకర్‌, తహసీల్దార్‌ రాఘవరెడ్డి 70 వలస కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • కేసముద్రంటౌన్‌: రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో కేసముద్రం స్టేషన్‌, కేసముద్రం విలేజీ, అమినాపురం గ్రామాల్లో కార్మికులకు శానిటైజర్లు అందజేశారు.
 • మహబూబాబాద్‌ టౌన్‌ : పట్టణంలోని సమాఖ్య విద్యా సంస్థలు, అడ్డగోడ క ల్పన, మానుకోట గోకుల యువసేన జిల్లా అధ్యక్షుడు అడ్డగోడ నరేశ్‌ ఆధ్వర్యం లో 150 మంది జర్నలిస్టులకు సరుకులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. 22వ వార్డు కౌన్సెలర్‌ అజయ్‌ ఫైర్‌ స్టేషన్‌కాలనీ, సింగునర్సయ్య కాలనీ, మిలటరీ కాలనీ, పెట్రోల్‌బంక్‌ కాలనీల్లో 20 క్వింటాళ్ల కూరగాయలు పంపిణీ చేశారు.   
 • నర్సింహులపేట : మండల కేంద్రానికి చెందిన కీర్తన మెడికల్‌ స్టోర్స్‌కు చెందిన యాకాంబ్రం 40 శానిటైజర్లు, ఎనర్జీ డ్రింక్స్‌, వంద మాస్కులు  పంపిణీ చేశారు. 
 • చిన్నగూడూరు: ఉగ్గంపల్లి సర్పంచ్‌ పూలమ్మ, ఎంపీటీసీ ఉదయమ్మ వలస కూలీలకు సరుకులు పంపిణీ చేశారు. ఎంపీడీవో సరస్వతి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రాంసింగ్‌, ఎస్సై ప్రసాదరావ్‌ బియ్యం, కూరగాయలు అందజేశారు.  
 • దంతాలపల్లి: పెద్దముప్పారంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ నూకల హిమబిందు సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.  
 • ఏటూరునాగారం/మంగపేట/గోవిందరావుపేట: ఏటూరునాగారం మండలంలోని గొత్తికోయలకు జీటీఎస్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఏఎస్పీ శరత్‌ చంద్రపవార్‌  సరుకులు అందజేశారు. అలాగే రేగులగూడెం గొత్తికోయలకు సొసైటీ ఫర్‌ క్రైస్ట్‌ యూనిటీ పాస్టర్స్‌ ఫెలో షిప్‌ ఆఫ్‌ మంగపేట ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు.అలాగే గోవిందరావుపేట, మంగపేట మండలాల్లో ఎమ్మెల్యే సీతక్క నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
 • పలిమెల: ముకునూరులోని గొత్తికోయలకు మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు బియ్యం,నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.  
 • జనగామ: పట్టణంలోని 10వ వార్డులో సంచార జాతులకు దాతల సహకారంతో వార్డు కౌన్సిలర్‌ నీల శ్రీజరాంమనోహర్‌తో కలిసి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమునలింగయ్య నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 
 • మహబూబాబాద్‌, నమస్తేతెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కూలీలు, నిరుపేదలకు సాయం చేసేందుకు దాతలు ముందుకు రావాలని మానుకోట మున్సిపల్‌ కమిషనర్‌ ఇంద్రసేనారెడ్డి కోరారు. నిత్యావసరాలు, మెడిసిన్‌ కోసం మున్సిపల్‌ కార్యాలయానికి వాట్సాప్‌ ద్వారా సమాచారం అందించాలన్నారు.  
 • వెంకటాపురం (నూగూరు): ములుగు జిల్లా వెంకటాపురం నూగూరు మండల పరిధి బెస్తగుడెంలో అక్రమంగా నిల్వ ఉంచిన  సుమారు లక్షా80 వేల విలువ చేసే మద్యాన్ని పట్టుకున్నట్లు  ఎక్సైజ్‌ అధికారులు చెప్పారు. 
 • జనగామ కలెక్టరేట్‌: జనగామ బచ్చన్నపేట మండల కేంద్రంలోని వీఆర్‌వో ఎస్‌ నాగార్జున విధుల నుంచి తొలగించారు. లాక్‌డౌన్‌ ఉత్తర్వులను పాటించకపోవడం, పోలీసులతో దురుసుగా ప్రవర్తించడంతో ఆర్డీవో మధుమెహన్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 


logo