పాఠశాలల్లో ధాన్యం కొనుగోలు!

- తొలి విడత 113 సెంటర్ల ఏర్పాటు
- పీఏసీఎస్‌లు, ఐకేపీకి కేటాయింపు
- ఇప్పటికే ఏడు కేంద్రాలు ప్రారంభం
వరంగల్‌రూరల్ జిల్లాప్రతినిధి, నమస్తేతెలంగాణ : జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలుకు తొలి విడత 113 కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. పీఏసీఎస్‌లకు 71, ఐకేపీకి 41, జీసీసీకి ఒకటి కేటాయించింది. ధాన్యం నిల్వ చేసే వసతి ఉన్న ప్రదేశాలనే ఈ సారి అధికారులు కొనుగోలు కేంద్రాలుగా ఎంపిక చేశా రు. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలతోపాటు మార్కెటింగ్ శాఖ, పీఏసీఎస్ గోడౌన్లు, ఫంక్షన్ హాళ్లు, రైస్‌మిల్లులను ఎంపిక చేశారు. సీజన్లో జిల్లాలో రైతుల నుంచి 1.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయా ల్సి ఉంటుం దని అధికారులు అంఛనా వేశారు. ఈ మేరకు గన్నీ సంచులు, గోడౌన్లను సమకూర్చుతున్నారు. ధాన్యా న్ని రైస్‌మిల్లులకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లను సిద్ధం చేశారు. ధాన్యం దిగుబడులు పెరు గనున్నందున జిల్లాలో ఈసారి 250 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. చివరకు 230 కేంద్రా లైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరికరాలతో తొలి విడత 113 సెంటర్లను నెలకొల్పాలని నిర్ణయించారు. అదనపు సెంటర్ల ఏర్పాటు కోసం కొంతమంది అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండో విడత ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వేయింగ్ మిషన్, తేమ కొలిచే యంత్రాలతోపాటు ఇతర పరికరాలను సమకూర్చే పనిలో ఉంది. 113 కేంద్రాల్లో ఇప్పటికే ఏడింటిని ప్రారంభించా రు. కొనుగోలు చేసే ధాన్యాన్ని ఇదే జిల్లాలోని 25 బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయించేందుకు అధికారులు నిర్ణయించారు. ధాన్యం క్వింటాలుకు ప్రభుత్వ మద్దతు ధర గ్రేడ్ ‘ఎ’ రకానికి రూ.1,835, కామన్‌కు రూ.1,815. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పౌరసరఫరాల సంస్థ చెల్లించనుంది.
సెంటర్ల ఏర్పాటు ఎక్కడంటే...
నీరుకుళ్ల, కటాక్షపురం, గూడెప్పాడ్, అమీనాబాద్, ముగ్దుంపురం, చెన్నారావుపేట, గొల్లపల్లి, పాపయ్యపే ట, ఊరుగొండ, మహ్మదాపురం, వెంకటాపూర్, నాచినపల్లి, తిమ్మంపేట, దుగ్గొండి, ముద్దునూరు, గిర్నిబావి, ఎలుకుర్తి, ఊకల్, రంగాపూర్, రాగంపేట, ఖానాపురం, అశోక్‌నగర్, మనుబోతులగడ్డ, బుధరావుపేట, ధర్మరావుపేట, పెద్దమ్మగడ్డ, వరికోలు, పులిగిల్ల, నల్లబెల్లి, అర్షనపల్లి, గుండ్లపహాడ్, గోవిందా పూర్, మేడపల్లి, ముత్తోజిపేట, నర్సంపేట, ఇటుకాలపల్లి, మాదన్నపేట, గురిజాల, రెడ్లవాడ, అలంకానిపే ట, నెక్కొండ, లావుడ్యతండ, నాగారం, సూరిపల్లి, లక్ష్మీపూ ర్, పరకాల, పోచారం, కంఠాత్మకూరు, వెల్లంపల్లి, చౌటుపర్తి, ఏనుగల్, రోల్లకల్, కల్లెడ, రాయపర్తి, కొండూరు, కా పులకనపర్తి, తీగరాజుపల్లి, సంగెం, ఎల్గూరిరంగంపేట, నల్లబెల్లి, చింతలపల్లి, మొండ్రాయి, జోగంపల్లి, నేరేడుపల్లి, మైలారం, గట్లకానిపర్తి, తహరాపూర్, వసంతపూర్, వర్ధన్నపేట, ఇల్లంద, ఉప్పరపల్లిలో పీఏసీఎస్‌ల ఆధ్వర్యం లో ఏర్పాటు చేస్తారు. ఐకేపీ ఆధ్వర్యంలో పెద్దాపూర్, పసరగొండ, సింగరాజుపల్లి, బొబ్బలోనిపల్లె, లక్ష్మీపురం, రా యపర్తి, నడికూడ, చౌటుపర్తి, నార్లాపూర్, రాంపూర్, గొల్లపల్లి, నారక్కపేట, మామిడాలవీరయ్యపల్లె, దీక్షకుంట, చం ద్రుగొం డ, చింతనెక్కొండ, ఏనుగల్, సోమారం, పర్వతగిరి, వడ్లకొండ, అన్నారం, పెరికేడు, కాట్రపల్లి, రాగన్నగూ డెం, రాయపర్తి, సన్నూరు, కొత్తూరు, తిర్మలాయపల్లె, ఊక ల్, మురిపిరాల, కొండాపురం, శాయంపేట, పత్తిపాక, ప్ర గతిసింగారం, కొప్పుల, పెద్దకోడెపాక, కాట్రపల్లి, నల్లబెల్లి, ల్యాబర్తి, చెన్నారం, దమ్మన్నపేట గ్రామాల్లో నిర్వహిస్తారు. జీసీసీకి కేటాయించిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఖానాపురం మండలంలోని అశోక్‌నగర్‌లో ఏర్పాటు చేస్తారు.
తాజావార్తలు
- ..ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : మాయవతి
- సంక్రాంతి స్పెషల్.. పవన్ కళ్యాణ్ ఇంట్లో రామ్ చరణ్..
- ‘వకీల్ సాబ్’ బడ్జెట్ శాటిలైట్ రైట్స్‌తోనే వచ్చేసిందా..?
- మీరెవరికి మద్దతిస్తున్నారు: మీడియాపై నితీశ్ చిందులు
- ఆత్మహత్య చేసుకుందామనుకున్నా..క్రాక్ నటుడి మనోగతం
- కుక్కపై లైంగిక దాడి.. ఓ వ్యక్తి అరెస్ట్
- మోదీ పాలనలో సుప్రీంకోర్టుపై నమ్మకం పోయింది: కె. నారాయణ
- చిరంజీవి బిగ్ సర్ప్రైజ్.. 2021లో డబుల్ డోస్ ఇస్తున్నాడా..?
- హైదరాబాద్-చికాగో నాన్‌స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభం
- ‘క్రాక్’ 5 రోజుల కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ డన్.. లాభాలు ఆన్