సత్ఫలితాలిస్తున్న జిల్లాల పునర్విభజన

వరంగల్ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లాల, గ్రామ పంచాయతీ పునర్విభజన గడపగడపకూ పాలనను చేరవేయడంలో ఎలా సత్ఫలితాలిస్తుందో కరోనా సందర్భంలోనూ మ రోసారి తేటతెల్లమైంది. దూరభారాలు తగ్గించుకొ ని, సామాజిక దూరాన్ని పాటించాలని శాస్త్రీయతను ప్రజలకు విడమర్చి చెప్పటంలోనే కాదు.. భారీ విపత్తును అతి సునాయాసంగా అధిగమించేలా చేసింది. కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంలో ఎక్కడికక్కడ కార్యసాధకులైన యంత్రాంగం కృషి ఫలితంగా ప్రజలకు మేలు జరిగిందనే సత్యం రుజువవుతున్నది. ఉమ్మడి వరంగల్ ఆరు జిల్లాలుగా రూపాంతరం చెందడం, ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఇద్దరు ఎస్పీలు, ఒక పోలీస్ కమిషనర్ (వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ జిల్లాలు ఒక్క పోలీస్ కమిషనరేట్ కింద ఉండడం తెలిసిందే), ఆరు జిల్లాల పంచాయతీ అధికారులు, జెడ్పీ చైర్మన్లు, కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు ఇలా ఎక్కడికక్కడ ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు అధికారులు ఒక్కటైన చేతనంగా కదులుతున్నారు. జిల్లాల పునర్విభజన వల్ల శీఘ్ర నిర్ణయాలు, వాటి అమలు, కట్టుదిట్టమైన కార్యాచరణ కొనసాగుతున్నది. జిల్లాల వికేంద్రీకరణ వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని పాలనా రంగంలో సుదీర్ఘ అనుభవం గల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఏ జిల్లాకు ఆ జిల్లా పోటీపడి కరోనాను కట్టడి చేయడంలో స్ఫూర్తిదాయక పాత్రను పోషించడం విశేషం. ప్రజలకు మెరుగైన పాలన అనుభవంలోకి రాగా, కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు కూడా సులువవుతున్నది.
తొలి దశ గుర్తించడంలో..
వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములు గు జిల్లాల పరిధిలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా వివిధ దేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించడం తొలి దశ. పట్టణాలు, మం డల కేంద్రాల నుంచి మొదలుకొని గ్రామ పం చాయతీ, వార్డు దాకా అన్ని శాఖల ఉన్నతాధికారులకు అరచేతిలో సర్వ సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఏ దేశం నుంచి ఎంతమంది వచ్చారు? వారి ఆరోగ్య పరిస్థితి ఏమిటి? అని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం సులువైంది. ఉదాహరణకు వరంగల్ అర్బన్ జిల్లాలో మార్చి 1 నుంచి జనతా కర్ఫ్యూ నాటికి (మార్చి 22) 814 మంది వివిధ దేశాల నుంచి వచ్చారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లే నేరుగా పర్యవేక్షించడం, పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడంతో కింది స్థాయి సిబ్బం ది అప్రమత్తమయ్యారు. ప్రజలు సైతం ముం దుకొచ్చి సహకరించడం వంటి అంశాలు కరో నా కట్టడికి తోడ్పాటును అందించాయి.
రెండో దశను పసిగట్టడంలోనూ..
కరోనా రెండోదశ తీవ్రతను, పరిణామాలను అంచనా వేయడంలో దేశానికి మార్గనిర్దేశనం చేసింది తెలంగాణ రాష్ట్రమేనని కేంద్రం సైతం కితాబిచ్చిన విషయం తెలిసిందే. ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చిన వారిని గుర్తించడంలో మెరుపు వేగాన్ని ప్రదర్శించేందుకు చేరువలో ఉన్నతాధికారులు ఉండటం అతి ముఖ్యమైన విజయసోపానం. పాలనను ప్రజల వద్దకు తీసుకుపోవడంతో పాటు అధికారుల సూక్ష్మస్థాయి పర్యవేక్షణ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో చేసిన చిన్న జిల్లాల ఏర్పాటు ప్రస్తుత క్లిష్ట సమయంలో ఫలితాన్నిస్తున్నది. ఉమ్మడి జిల్లాకు కలెక్టర్‌తో పాటు కీలక శాఖలకు సైతం ఉన్నతాధికారి ఒక్కరే ఉండేవారు. ఆ పరిస్థితి ఉంటే ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారిని గుర్తించడం కష్టంగా ఉండేది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఆరుగురు కలెక్టర్లతో పాటు ప్రతి జిల్లాకూ పోలీసు ఉన్నతాధికారులు, వైద్యాధికారులు ఉన్నారు. దీంతో కరోనా వి జృంభించకుండా చర్యలు చేపట్టారు. జిల్లాల వారీగా ఉన్నతాధికారులు సమష్టిగా వైరస్‌పై యుద్ధం చేస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోనూ ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
సూక్ష్మ పరిశీలన-స్థూల విజయం
ప్రతి జిల్లాలో ఉన్నతాధికారులు కరోనా వైరస్ విజృంభించకుండా సూక్ష్మస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఇప్పటి వరకు సగానికి పైగా అర్బన్ ప్రాంతం ఉన్న వరంగల్ అర్బన్ జిల్లా మినహా మిగతా ఐదు జిల్లాల్లో కరోనా సోకిన వారి సంఖ్య పెద్దగా లేకపోయినా చిన్నపామునైనా పెద్దకర్రతో కొట్టాలన్న చందంగా అధికారులు కార్యాచరణను చేపట్టారు. ములుగు జిల్లా పస్రా, ఏటూరునాగారం ప్రాంతం నుంచి కొంతమంది ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనకు వెళ్లారని తెలిసి ఆగమేఘాల మీద యంత్రాంగం ఈ రెండు ప్రాంతాల్లో మోహరించింది. అదేవిధంగా జనగామ జిల్లా నర్మెట మండలం వెల్దండతో పాటు జనగామ పట్టణంలో సైతం ఇదే కార్యాచరణ అమలైంది. ఒకరిద్దరిని గుర్తించిన అధికారులు వెంటనే వారిని క్వారంటైన్‌కు తరలించారు. చిన్న జిల్లాలు కావడంతో అధికారులు సైతం పూర్తి స్థాయిలో దృష్టిసారించే అవకాశం కలిగింది. ప్రభుత్వం నుంచి వస్తున్న ఆదేశాలు అమలు చేయడంలో అధికారులు చురుకుగా కదులుతున్నారు. ఇలాంటి సూక్ష్మ పరిశీలన వల్లే విజయం అందుతున్నది.
లాక్ డౌన్ అమలు.. వసతుల కల్పన..
కరోనా కట్టడికి లాక్డౌన్ శ్రీరామ రక్షగా మారి న నేపథ్యంలో ఆరు జిల్లాల అధికార యంత్రాం గం దీనిని పకడ్బందీగా అమలు చేస్తున్నది. పో లీసు ఉన్నతాధికారులు పక్కాగా ప్రణాళికలు రూపొందించుకుని లాక్‌డౌన్‌ను విజయవంతం చేస్తున్నారు. ఇది చిన్న జిల్లాల వల్ల అందుతున్న ఫలితాలకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఉమ్మడి జిల్లాగా ఉంటే కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కష్టంగా మారేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో చిన్న జిల్లాలు ఉపయుక్తమవుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా నిత్యావసర సరుకుల చేరవేతలోనూ ఈ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మొ త్తంగా పాలనా వికేంద్రీకరణ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్ని కట్టడి చేయడంలో ఎంతగానో తోడ్పడుతుండడం విశేషం.
తాజావార్తలు
- ఇమ్మిగ్రేషన్ సంస్కరణలను స్వాగతించిన టెక్ కంపెనీలు
- బైడెన్ వచ్చిన వేళ చైనా కొత్త వాదన
- ఫ్యూయెల్ క్రెడిట్ కార్డులతో ఇన్ని బెనిఫిట్సా..!
- మరో ఆసుపత్రికి శశికళ తరలింపు
- స్టార్ హీరో చిత్రంలో ' గ్యాంగ్ లీడర్' హీరోయిన్..!
- 31 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ మూడో దశ పరీక్షలు
- హైదరాబాద్‌లో టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రం ఏర్పాటుపై పరిశీలన
- రా రమ్మంటాయి..ఆనందాన్నిస్తాయి
- కమలా హ్యారిస్ పర్పుల్ డ్రెస్ ఎందుకు వేసుకున్నారో తెలుసా ?
- చంపేస్తామంటూ హీరోయిన్‌కు బెదిరింపు కాల్స్..!