అంకితభావంతో పనిచేయాలి

- గిరిజన స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్, నమస్తేతెలంగాణ: కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఆదివారం కలెక్టరేట్లో అంగన్వాడీ సిబ్బందికి శానిటైజర్స్, మాస్కులను కలెక్టర్ గౌతమ్‌తో కలిసి పంపిణీ చేశారు. జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి సం ధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో 1400 శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటీ సర్వే ద్వారా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నవారిని గుర్తించి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో సీడీపీవోలు నాగమల్లేశ్వరి, డెబోరా, అంగన్వాడీ టీచర్లు సుభాషిణి, భవాని, సులోచన, సునీత పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్కు రూ.1.08లక్షల చెక్కు అందజేత
బయ్యారం : బయ్యారం మండల ప్రజాప్రతినిధులు సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వ్యాపారులు వద్ద విరాళాలు సేకరించారు. ఆదివారం మంత్రి సత్యవతి రాథోడ్, జెడ్పీ చైర్పర్సన్ బిందు సమక్షంలో కలెక్టర్ గౌతమ్‌కు రూ. లక్ష 8వేల చెక్కును అందజేశారు. సొసైటీ చైర్మన్, సిబ్బంది రూ.50వేలు, ఎంపీపీ మౌనిక, వైస్‌ఎంపీపీ గణేశ్, ఎంపీటీసీ కుమారి రూ.20వేలు, సర్పంచ్ మమత రూ. 5వేలు, వేం యాకూబ్‌రెడ్డి (రవి మెడికల్ ) రూ.10వేలు, సుధాకర్‌రెడ్డి, శ్రీను, సతీశ్, సుధాకర్, క్రాంతి రూ.23వేలను విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ సత్యనారాయణ, వైస్ ఎంపీపీ గణేశ్, జిల్లా నాయకుడు శ్రీకాంత్ నాయక్ ఉన్నారు.
తాజావార్తలు
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్‌షిప్‌లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు