శుక్రవారం 29 మే 2020
Warangal-rural - Apr 01, 2020 , 02:17:00

వలస కడుపున ఆత్మీయ ముద్ద

వలస కడుపున ఆత్మీయ ముద్ద

వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ : ‘మన రాష్ట్ర వికాసం కోసం దేశంలోని అనేక రాష్ర్టాల నుంచి వలస కూలీలు మన దగ్గరికి వచ్చారు. దేశమంతా లాక్‌డౌన్‌ ఉన్న పరిస్థితుల్లో వారు స్వస్థలాలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ స్థితిలో వారిని మా బిడ్డలుగానే భావిస్తాం. మన ప్రజలకెలా అ యితే మనిషికి 12కిలోల బి య్యం, రూ.500 ఇస్తున్నా మో వివిధ రాష్ర్టాల నుం చి వచ్చిన వలస కూలీలకు వర్తింపజేస్తాం. ఎ వరూ అధైర్యపడొద్దు. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి’ అంటూ  ముఖ్యమంత్రి కేసీఆర్‌ అ క్కున చేర్చుకున్నారు. సీఎం ప్రకటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ వలస కూలీలను గుర్తించింది. వారికి బియ్యం, నగదు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చూపిన ఈ దాతృత్వానికి వివిధ రాష్ర్టాల కూలీలు చేతులెత్తి మొక్కుతున్నారు. ‘తిండిలేక అల్లాడే పరిస్థితి వస్తుందని ఆందోళన చెందినం. కానీ, సర్కార్‌ భగవాన్‌ రూప్‌మే హమారా పేట్‌ బర్తీ హై..’ అంటూ వివిధ రాష్ర్టాల కూలీలు, సంచారజాతులు సంబురంగా ఉన్నాయి. పంపిణీ చేసిన బియ్యంతో వంట వండుకుని పిల్లాపాపలతో తింటున్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, బీహార్‌, మధ్యప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల నుంచి అర్బన్‌ జిల్లాకు దాదాపు పదివేల మంది వలస కూలీలు వచ్చారు. ఆవాసాలు లేనివారికి ఆవాసం కల్పించడంతోపాటు వండుకునే అవకాశాలు లేనివారికి జిల్లా అధికారులు వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో వంటచేసి పెడుతున్నారు. ఇంకా తమ అధికారుల దృష్టికి రాని వివరాలు ఉంటే చెప్పాలని కోరుతున్నారు. 

తేనెపట్టు దండాలు 

చెట్లమీద నుంచి తీసిన తేనెను విక్రయించి పొట్టపోసుకునే 60 సంచారజాతుల కుటుంబాలకు వరంగల్‌ ఉర్సుగుట్ట ప్రాంతంలో అధికారులు తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేశారు. వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, స్థానిక కార్పొరేటర్‌ సోమవారం రాత్రి ఒక్కొక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసేందుకు వీలుగా కుటుంబానికి రూ.500 అందజేశారు. వసతి, భోజన ఏర్పాట్లు తదితర అంశాలను తెలుసుకునేందుకు నమస్తే తెలంగాణ బృందం మంగళవారం వారిని కలిసింది. 

 గుడారం ఎదుట వెలిగిన పొయ్యి 

ఉర్సుగుట్ట వద్ద చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఉన్నారు. ప్రతి గుడారం ఎదుట పొయ్యి.. పొయ్యి మీద గిన్నె.. ప్రతి గుడారం ఎదుట బియ్యం బస్తా కనిపించింది. అప్పటికే అక్కడికి ఓ బేకరి యజమాని, ఆయన స్నేహితుడు వచ్చి డబుల్‌రొట్టెలు (బ్రెడ్‌) పంపిణీ చేస్తున్నారు. ఆరేడు సంవత్సరాల చిన్నపిల్లలు బ్రెడ్‌ తింటున్నారు. వండుకునేవాళ్లు వండుకుంటున్నారు. ‘మేం ఎక్కడ పడితే అక్కడ తిరుగు తాం. రెండునెలలైంది. ఇక్కడికొచ్చి తిరుగు తూ తిరుగుతూ వెళ్లిపోతాం. బీమారీ వచ్చింద ని తెలిసి ఇంటికి పోదాం అనుకున్నాం. కానీ పూరా బంద్‌ అయినది. పోలేము బతుకెట్లా అ నుకుంటున్న దశలో సర్కారు మాకిలా ఉచితం గా బియ్యం ఇచ్చిందని వారు సంతోషం వ్యక్తం చేశారు. సర్కారుకు మాటలకందని కృతజ్ఞతలు చెబుతున్నారు. వీళ్లంతా బీహార్‌ రాష్ట్రంలో బేగస్నీ, హజీపూర్‌ జిల్లాలకు చెందినవారు. 


logo