శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Mar 31, 2020 , 02:47:42

శభాష్‌!

శభాష్‌!

జయశంకర్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:  సింగరే ణి పారిశ్రామిక ప్రాంతమైన భూపాలపల్లి ఏరియాలో అధికార యం త్రాంగం కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం స్థాని క ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జెడ్పీ చైర్‌ప ర్సన్‌ జక్కు శ్రీహర్షిణితో కలిసి జిల్లాలో కరోనా వ్యాప్తి నిరో ధక చర్యలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ అజీమ్‌ అ ధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక ఆంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్దులోని జిల్లాలో అధికార యంత్రాంగం ప్రభుత్వ ప్రాధాన్యం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేస్తున్నదని అన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు కలెక్టర్‌ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ చేస్తున్న కృషి అనిర్వచనీ యమని, ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. లా క్‌డౌన్‌ విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యహరిం చాలని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో నాలుగు వేల ఏడు  మంది వలస కార్మికులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ము ఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు వీరందరికీ భోజన, వై ద్య, ఆవాస సౌకర్యం కల్పించామన్నారు. భూపాలపల్లి జిల్లాలోనే కాదు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లా లోనే కరోనా ప్రభావం అంతగా లేదని మంత్రి అన్నారు. నిత్యావసర స రుకులను అధిక ధరలకు విక్రయించే వారిపై పీడీ యాక్టు ప్రయోగిస్తామని హెచ్చరించారు. పంట ఉత్పత్తులను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులకు భరోసా కల్పించాలని ఆదేశించారు. ఎమ్మె ల్యే గండ్ర మాట్లాడుతూ గతంలో ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా ఈ యాసంగి కొనుగోళ్లలో పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకట రాణి, జిలా ్లపంచాయతీ అధికారి చంద్రమౌళి, డీఎస్‌వో గౌరీశంకర్‌, డీఎం, డీఏవో, డీఎంవో పాల్గొన్నారు.