మంగళవారం 14 జూలై 2020
Warangal-rural - Mar 31, 2020 , 02:45:48

వలస కూలీలకు బాసటగా నిలువాలి

వలస కూలీలకు బాసటగా నిలువాలి

మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ : వలస కూలీలకు బాసటగా నిలువాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ప్రైవేట్‌ పాఠశాలల సంఘం సభ్యు లు వలస కూలీలను ఆదుకునేందుకు నిత్యావసర సరుకులను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల ఆక లి తీర్చేందుకు మహబూబాబాద్‌ ప్రైవేట్‌ పాఠశాలల సంఘం ముందుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు చిర్ర యాకాంతం, కోశాధికారి ఖలీద్‌పాషా, సభ్యులు పాల్గొన్నారు.

గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం రూ.50 లక్షల విరాళం

రాష్ట్రప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్‌ రెసిడెన్షియల్‌ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో 1950 మంది ఉపాధ్యాయులు సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళాన్ని అందజేస్తున్నట్లు ఆమోదపత్రాన్ని సీఎం కేసీఆర్‌కు పంపినట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాలోత్‌ సోమేశ్వర్‌ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్‌కు వారు ఆమోదపత్రాన్ని అందజేశారు. 


logo