మంగళవారం 07 ఏప్రిల్ 2020
Warangal-rural - Mar 27, 2020 , 02:33:57

నగర శుద్ధి..

నగర శుద్ధి..

  • నగరమంతా సోడియం హైపో క్లోరైట్‌తో స్ప్రే
  • హన్మకొండలో ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి, చీఫ్‌విప్‌ దాస్యం
  • పాల్గొన్న ఎమ్మెల్యే అరూరి, కలెక్టర్‌, సీపీ, మున్సిపల్‌ కమిషనర్‌
  • మూడు ఫైర్‌ ఇంజిన్లను వినియోగించిన బల్దియా అధికారులు
  • డివిజన్లలో యూపీఎల్‌ స్ప్రే యంత్రాల సేవలు
  • సిద్ధంగా 12 వేల లీటర్ల సోడియం  హైపో క్లోరైట్‌

వరంగల్‌, నమస్తేతెలంగాణ : కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా బల్దియా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో నరగంలో కర్ఫ్యూ వాతారణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నగరమంతా సో డియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిం ది. నగర ప్రధాన రహదారుల్లో ఫైర్‌ ఇంజిన్లతో పిచికారీ చే సేందుకు చర్యలు తీసుకుంటోంది. డివిజన్లలోయూపీఎల్‌ కంపెనీకి చెందిన స్ప్రే వాహనాన్ని వినియోగించుకునేందు కు చర్యలు తీసుకుంది. 12 వేల లీటర్ల సోడియం హైపో క్లోరైట్‌ను బల్దియా అధికారులు కొనుగోలు చేశారు. అవసరమైతే  మరో 10 వేల లీటర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధం గా ఉన్నారు. దీనికి తోడు వెయ్యి బస్తాల బ్లీచింగ్‌ పౌడర్‌ నిల్వలను  సిద్ధ్దంగా ఉంచారు. ప్రధాన రహదారులతో పాటు గ్రేటర్‌ పరిధిలోని 58 డివిజన్‌లో బ్లీచింగ్‌తో పాటు సోడియం హైపోక్లోరైట్‌ స్ప్రే చేసే ప్రక్రియను మొదలు పెట్టింది. గురువారం హన్మకొండ  అశోక జంక్షన్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పైర్‌ ఇంజి న్ల ద్వారా స్ప్రే చేసే ప్రక్రియను ప్రారంభించారు. యూపీఎల్‌ కంపెనీకి చెందిన స్ప్రే మిషన్‌ను 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ రజిత ప్రత్యేక చొరవతో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి డివిజన్‌కు తీసుకవచ్చారు. జన్మభూమి జంక్షన్‌లో క మిషనర్‌ పమేలా సత్పతి స్ప్రే ప్రక్రియను ప్రారంభించారు.నగరంలో సోడియం హైపోక్లోరైట్‌ పిచికారీ చేసేందుకు  4 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన ఫైర్‌ ఇంజిన్‌తో పాటు, రెండు 400 లీటర్ల  సామర్థ్యం గల పైర్‌ ఇంజిన్ల వినియోగించుకుంటున్నట్లు ఎంహెచ్‌వో డాక్టర్‌ రాజారెడ్డి తెలిపారు. 

పిచికారీ యంత్రాన్ని ప్రారంభించిన ఎర్రబెల్లి

రెడ్డికాలనీ  : కరోనా వైరస్‌ నిర్మూలనకు వినియోగించే సోడియం హైపో క్లోరైట్‌ పిచికారీ యంత్రాన్ని గురువారం హన్మకొండ అశోక జంక్షన్‌లో మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. మంత్రి వెంట కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మం తు, కమిషనర్‌ పమేలా సత్పతి, సీపీ రవీందర్‌, చీఫ్‌ విప్‌  వినయ్‌భాస్కర్‌, ఎమ్మెల్యే రమేశ్‌, డీసీసీబీ చైర్మన్‌ రవీందర్‌రావు, కుడా చైర్మన్‌ యాదవరెడ్డి, కార్పొరేటర్లు శ్రీనివాస్‌, విద్యాసాగర్‌, రవీందర్‌  తదితరులున్నారు. అలాగే మేయర్‌ ప్రకాశ్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చింతం సదానందంతో పాటు, కార్పొరేటర్లు, టీఆర్‌ఎస్‌ నాయకు లు, అగ్నిమాపక సిబ్బందితో కలిసి హన్మకొండ చౌర స్తాలోని రోడ్లు, షాపులకు స్ప్రే చేశారు.

సామాజిక దూరం పాటించాలి...

నక్కలగుట్ట : కూరగాయల మార్కెట్‌లో సోషల్‌ డిస్టెన్స్‌ పాటించే విధంగా  చర్యలు చేపట్టాలని మంత్రి దయాకర్‌రావు అధికారులకు సూచించారు. హన్మకొండలోని ఎక్సైజ్‌ కాలనీలోగల రైతుబజార్‌ను గురువారం చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, మా ర్కెట్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. 


logo