మంగళవారం 26 మే 2020
Warangal-rural - Mar 27, 2020 , 02:34:40

విరాళాల వెల్లువ

విరాళాల వెల్లువ

కరోనా నేపథ్యంలో సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి రూ.5లక్షలు, ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు వేతనం రూ.3.50లక్షలు, సీడీఎఫ్‌ నిధులు రూ.3కోట్లు, ఎమ్మెల్యే రాజయ్య రూ.2.50లక్షల వేతనం, సీడీఎఫ్‌ నిధులు రూ.3కోట్లు అందించారు. అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌ సుధీర్‌కుమార్‌ రూ. లక్ష ఇచ్చారు. 

-వరంగల్‌ ప్రధాన ప్రతినిధి-నమస్తే తెలంగాణ


సీఎం సహాయ నిధికి కడియం రెండు నెలల జీతం రూ.5లక్షలు అందజేత

 రాష్ట్రంలో  కరోనా వ్యాప్తిని నియంత్రించేందు కు తనవంతు సాయంగా మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడి యం శ్రీహరి రెండు నెలల జీతం రూ.5లక్షలను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ ప్రజల యోగక్షేమాల కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని, దేశమంతా సీఎం చేస్తున్న కృషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని అన్నా రు.  అందరం కలిసికట్టుగా ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి  వైరస్‌ వ్యాప్తిని అడ్డుకట్టవేయాలని ప్రజల్ని కోరారు.

మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి రూ.3కోట్ల సీడీఎఫ్‌ నిధులు, రూ.3.5లక్షలు నెల వేతనం

జనగామ, నమస్తే తెలంగాణ : కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు తనవంతుగా ముఖ్యమంత్రి సహా య నిధి (సీఎంఆర్‌ఎఫ్‌)కి శాసన మండలి చీఫ్‌విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు విరాళం ప్రకటించారు. ని యోజకవర్గ నిధుల నుంచి రూ. మూడు కోట్లు సహా నెల వేతనం రూ.3.50 లక్షలు సీఎంఆర్‌ఎఫ్‌కు అందజేస్తూ ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ అందజేసినట్లు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటు న్న ముందస్తు చర్యలకు ప్రజలంతా సహకరించి స్వీయ ని ర్బంధంతో కట్టడి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వ్య క్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు.

ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య రూ.3కోట్ల సీడీఎఫ్‌ నిధులు, రూ.2.50 లక్షలు నెల వేతనం..

స్టేషన్‌ఘన్‌ఫూర్‌టౌన్‌ : కొవిడ్‌-19 (కరోనా) వైరస్‌ నివారణకు స్టే షన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తా టికొండ రాజయ్య ఒక నెల వేతనం రూ. 2.50 లక్షలు, నియోజక వర్గ అభివృద్ధికి వచ్చిన సీడీఎఫ్‌ నిధులు రూ.3 కోట్లను విరాళంగా  సీఎం స హాయ నిధికి అందజేస్తున్నట్లు ఆ యన తెలిపారు. అలాగే  వైద్యుడిగా, ఎమ్మెల్యేగా ప్ర జలకు అందుబాటులో ఉంటానని ఎదైనా సమస్య వస్తే 98497 90363 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వైద్యపరంగా, వ్యక్తిగత కష్టాల్లో తానే స్వయంగా పాలు పంచుకుంటానని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పిన జాగ్రత్తలు పాటిం చాలని ఈ సందర్భంగా రాజయ్య సూచించారు.

అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌ నెల జీతం, ప్రజాప్రతినిధుల నెల వేతనాలు రూ.12.20లక్షలు

సుబేదారి : సీఎం సహాయ నిధి కి వరంగల్‌ అర్బన్‌ జెడ్పీ చైర్మన్‌ డా క్టర్‌ సుధీర్‌కుమార్‌ నెల గౌరవ వేత నం రూ.లక్ష అందిస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు జెడ్పీ టీసీలు, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, మండల కో ఆప్షన్‌ సభ్యులు, సర్పంచ్‌లూ ఒ క నెల వేతనాలు రూ.12.20లక్షలు మొత్తం రూ.13.20 లక్షలను సీఎం సహాయ నిధికి అందజేసేందుకు నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. 

నగర వాసుల విరాళాలు..

హన్మకొండ నమస్తే తెలంగాణ : కరోనా వైరస్‌ను అరికట్టేందుకు తనవంతు సాయంగా మాస్టర్జీ విద్యా సంస్థల చై ర్మన్‌ సంఘం రెడ్డి సుందర్‌రాజ్‌ ముందుకు వచ్చారు. ఈ మేరకు రూ.లక్ష చెక్కును సీఎం సహాయ నిధికి విరాళంగా గురువారం జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతుకు అందజేశారు. అలాగే నగరంలోని రామన్నపేటవాసి రిటైర్డ్‌ అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌ కూసం గోవిందరావు రూ.20వేల చెక్కును కలెక్టర్‌కు అందజేశారు. 


logo