సోమవారం 25 జనవరి 2021
Warangal-rural - Mar 23, 2020 , 02:22:25

జనతా కర్ఫ్యూ సక్సెస్‌

జనతా కర్ఫ్యూ సక్సెస్‌

  • ‘కొవిడ్‌-19’ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన సకల జనులు
  • సాయంత్రం 5 గంటలకు చప్పట్లతో సంఘీభావం
  • స్వీయ నియంత్రణ పాటించిన ఎమ్మెల్యేలు
  • రోడ్డెక్కని బస్సులు.. తెరుచుకోని దుకాణాలు
  • కొన్నిచోట్ల రోడ్లను దిగ్బంధించిన పోలీసులు
  • నిర్మానుష్యంగా మారిన రహదారులు, కూడళ్లు
  • ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన జిల్లా కలెక్టర్‌
  • 31 వరకు లాక్‌డౌన్‌
  • కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం
  • సహకరించాలని ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు

జిల్లాలో జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. ‘కొవిడ్‌-19’ నేపథ్యంలో ప్రధాని మోడీ,  సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రాలేదు. స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించారు. ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి తదితర ప్రజాప్రతినిధులు కుటుంబసభ్యులతో ఇళ్లలోనే గడిపారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు, ట్రాన్స్‌పోర్టు, ఇతర వాహనాలు ఏవీ నడువలేదు. జాతీయ రహదారులతోపాటు, జిల్లా, మండల కేంద్రాల్లోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి. బస్‌ స్టేషన్లు బోసిపోయాయి. రెవెన్యూ, పోలీసు, పంచాయతీ శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించారు. వాహనాలు తిరుగకుండా పోలీసులు జిల్లావ్యాప్తంగా చర్యలు తీసుకున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించిన జిల్లా ప్రజలకు కలెక్టర్‌ హరిత ధన్యవాదాలు చెప్పారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నెల 31 వరకు రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని సీఎం కేసీఆర్‌ కోరారు.

(వరంగల్‌రూరల్‌ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. జనం పూర్తిగా తమ ఇళ్లకే పరిమితమై చరిత్ర సృష్టించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ప్రజలెవరూ తమ ఇళ్ల నుంచి బ యటకు రాలేదు. కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే గడిపారు. స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు, ట్రాన్స్‌పోర్టు, ఇతర వా హనాలేవి రోడ్డెక్కలేదు. ఆటోలు కూడా తిరగలే దు. దీంతో జిల్లాలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సర్వీసులు మాత్ర మే పనిచేశాయి. కరోనా వైరస్‌ కట్టడికి ఈ నెల 22 న ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు జన తా కర్ఫ్యూ పాటించాలని గత గురువారం ప్రధా ని మోదీ ప్రజలకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనికి తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ మ ద్దతు ప్రకటించింది. 14 గంటలు కాదు ఆదివా రం ఉదయం 6 నుంచి సోమవారం 6 వరకు 24 గంటలు జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఉద్య మ స్ఫూర్తితో 24 గంటల జనతా కర్ఫ్యూ విజయవంతం చేయాలన్నారు. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పిలుపుతో సకల జనులు స్వచ్ఛందంగా జ నతా కర్ఫ్యూ 24 గంటలు పాటించేందుకు ముం దుకొచ్చారు. కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు అన్నీ ముందుగానే సమకూర్చుకున్నారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఇళ్ల నుంచి బయటకు రాలేదు. కుటుంబ సభ్యుల తో కలిసి ఇళ్లలో స్వీయ నియంత్రణ పాటించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా జనతా కర్ఫ్యూ జరిగింది. దినసరి కూలీలు పనులకు వెళ్లలేదు. శనివారం రాత్రి వరకు ఆర్టీసీ బస్సు డిపోలకు చేరుకున్న బస్సులేవి ఆదివారం ఉదయం బయటకు రాలేదు. జిల్లాలోని పరకాల, నర్సంపేటలోని డి పోల్లోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ట్రాన్స్‌పోర్టు వాహనాలతో పాటు ఆటోలు, జీపు లు, ఇతర వాహనాలేవీ కూడా తిరగలేదు. అన్ని వర్గాల ప్రజలు జనతా కర్ఫ్యూ పాటించారు. పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు చల్లా ధ ర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి, పరకాల, నర్సంపేట, వ ర్ధన్నపేట మున్సిపల్‌ చైర్‌పర్సన్లు సోదా అనిత, గుంటి రజిని, అరుణతోపాటు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులెవరూ తమ ఇళ్ల నుంచి బయటకు రాలే దు. కుటుంబ సభ్యులతో కలిసి స్వీయ నియంత్ర ణ పాటించారు. రోజంతా ఇళ్లకే పరిమితమయ్యా రు. టీవీలు వీక్షించడంతోపాటు పత్రికలను తిరిగేశారు. జనం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల లో క్యారం, చెస్‌ తదితర ఆటలు ఆడారు. గతం లో బంద్‌ జరిగితే మధ్యాహ్నం 12 గంటల తర్వా త దుకాణాలు తెరుచుకోవడం, ప్రజలు ఇళ్ల నుం చి బయటకు వెళ్లటం కనబడేది. జనతా కర్ఫ్యూను పురస్కరించుకుని ఆదివారం అలాంటిదేమీ జరగలేదు. కేవలం పాల డిపోలు, పెట్రోల్‌ బంకులు, దవాఖానలు, మెడికల్‌ షాపులు మాత్రమే పనిచేశాయి. సాయంత్రం 5 గంటలకు జనం ఎవరికివారే తమ ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు వ చ్చి వైద్యులు, సిబ్బంది సేవలకు సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతి కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి చప్పట్లు కొట్టి వైద్యులు, సిబ్బంది సేవలకు సంఘీభావం తెలిపారు. 

రహదారులు నిర్మానుష్యం..

తొలిసారి ఒకరోజు రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట పట్టణాల్లోని జంక్షన్లలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బస్సు, రైల్వే స్టేషన్లు బోసిపోయా యి. సకల జనులు బయటకు వెళ్లకపోగా పోలీసులు వాహనాలేవీ తిరగకుండా రహదారులను దిగ్బంధం చేశారు. రోడ్లకు అడ్డంగా ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్ల వంటి వాహనాలను పెట్టారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఒక్క వాహనం రోడ్డెక్కలేదు. రెవెన్యూ, పోలీసు, వైద్యారోగ్యం, పంచాయతీ తదితర శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించారు. గ్రామాల్లో పంచాయతీ సిబ్బంది పారిశుధ్య పనులు చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు జనతా కర్ఫ్యూను పరిశీలించారు. ఆర్డీవో మహేందర్‌జీ, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట ఏసీపీలు ఫణీందర్‌, శ్రీనివాస్‌, రమేశ్‌తోపాటు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, తహసీల్దార్లు గ్రామాలను సందర్శించారు. పరిస్థితిని సమీక్షించారు. దుగ్గొండి, గీసుగొండ మండలంలో పోలీసులు వివాహం జరిగిన ఇళ్లకు చేరుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు. గీసుగొండ మండలంలోని కీర్తినగర్‌ వద్ద వివాహం చేసుకుని ఇంటికి వెళ్తున్న వధూవరులు సాయంత్రం 5 గంటలు కావడంతో రహదారిపైనే ఆగి చప్పట్లు కొట్టి వైద్యులు, సిబ్బంది సంఘీభావం తెలిపారు. జనతా కర్ఫ్యూను పురస్కరించుకుని ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా స్వీయ నియంత్రణ పాటించిన ప్రజలకు కలెక్టర్‌ ఎం హరిత ధన్యవాదాలు చెప్పారు.

31వరకు లాక్‌డౌన్‌..

సీఎం కేసీఆర్‌ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. జనతా క ర్ఫ్యూను సక్సెస్‌ చేసిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఈ నెల 31 వరకు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ప్రకటించారు. తెలంగాణలో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. లాక్‌డౌన్‌ దరిమిలా 31 వరకు ఇంట్లో నుంచి ఎవరూ బయటకు వెళ్లరాదన్నారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూసి ఉంటాయని, అత్యవసర సర్వీసులు మా త్రం పనిచేస్తాయని ఆయన వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల్లో ఒకరు బ యటకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని చెప్పా రు. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలేవి తిరగవ ని, ప్రభుత్వ ఉద్యోగులు రొటేషన్‌ పద్ధతిన ఇరవై శాతం మంది విధులు నిర్వహిస్తారని సీఎం కేసీఆ ర్‌ తెలిపారు. పేదలకు కష్టం రాకుండా రాష్ట్ర ప్రభు త్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. రే షన్‌కార్డు ద్వారా అదనంగా పన్నెండు కిలోల బి య్యంతోపాటు కార్డుదారులకు రూ.1,500 నగ దు అందజేయనున్నట్లు ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


logo