బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Mar 22, 2020 , 02:16:51

రాజధాని రైలులో కరోనా కలకలం

రాజధాని రైలులో కరోనా కలకలం

  • ఇద్దరు అనుమానితుల పట్టివేత
  • గంటన్నర పాటు కాజీపేటలో నిలిచిన ట్రెయిన్‌..
  • ససేమిరా దిగమని చెప్పిన దంపతులు
  • పోలీస్‌, రైల్వే అధికారుల ఒత్తిడితో కిందకు..
  • రక్షణ చర్యల మధ్య ఎంజీఎంకు తరలింపు
  • ప్రాథమిక పరీక్షల అనంతరం హైదరాబాద్‌కు..
  • బాధితులది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం..

కాజీపేట, మార్చి 21: రాజధాని సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు లో ప్రయాణిస్తున్న ఇద్దరు కరోనా అనుమానితులను రైల్వే అధికారులు పట్టుకున్న ఘటన శనివారం ఉదయం చోటుచేసుకుం ది. రైల్వే అధికారులు ఏవో పూర్ణచందర్‌రావు, తోటి ప్రయాణికుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్‌కు చెందిన నవ దంపతులు ఇటీవల విహార యాత్ర కోసం ఇండోనేషియా వెళ్లారు. యాత్ర ముగించుకుని శుక్రవారం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ ఎయి ర్‌ పోర్టులో దిగారు. అక్కడ ఇద్దరు దంపతులను కరోనా నియంత్రణ అధికారులు, సిబ్బంది పరిశీలించి, ఏప్రిల్‌ 5 వరకు హోం క్యా రంటైన్‌లో ఉండాలని చేతులపై స్టాంపింగ్‌ చేశారు. అప్పటి కే వీరు బెంగుళూర్‌- హ జరత్‌ నిజాముద్దీన్‌ మధ్య నడిచే రాజధాని సూపర్‌ఫాస్ట్‌ రైలుకు రిజర్వేషన్‌ చేయిం చుకున్నారు. స్వం త రాష్ర్టాకి వెళ్లిన తర్వాత హోం క్యారంటైన్‌కు వెళ్తామని నమ్మ బలికి బయటికి వచారు. శనివారం ఉదయం సికింద్రాబాద్‌ రై ల్వేస్టేషన్‌లో రాజధాని రైలులోని బీ-3 బోగీలో గల 3, 7 సీట్ల లో కూర్చున్నారు. రైలు కదిలిన తర్వాత వీరు దగ్గుతుండటంతో తోటి ప్రయాణికులు గుర్తించి టీటీఈకి సమాచారం తెలిపారు. వారు విచారించగా దంపతులిద్దరు పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో టీటీఈలు మహిళ చేతికి ఉన్న స్టాంపింగ్‌ గమనించారు. అప్పటికే రైలు కాజీపేట రైల్వే జంక్షన్‌ దాటింది. దీం తో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఆందోళన చేపట్టడంతో టీటీఈలు రైలును ఆపి ఉన్నతాధికారులకు సమాచారం అందించా రు. సికింద్రాబాద్‌ రైల్వే ఉన్నతాధికారుల ఆదేశంతో స్థానిక అధికారులు రైలును తిరిగి స్టేషన్‌కు రప్పించి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే జంక్షన్‌కు చే రుకున్న రైల్వే, పోలీసు అధికారులు, ఆర్పీఎఫ్‌, జీఆర్పీ అధికారులు ఇద్దరు దంపతులను రైలు దింపేందుకు ఎంత ప్రయత్నించినా వినలేదు. చివరికి ప్రత్యేక డ్రెస్‌లు, మాస్క్‌లు తెప్పించి వారికి ధరింప చేసి రైలు దింపారు. అప్పటికే రెడీగా ఉంచిన 108 వాహనంలో ఆ ఇద్దరినీ ఎక్కించి ఎంజీఎం దవాఖానకు తరలించారు. దీంతో తోటి ప్రయాణికులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

గంటా ఇరవై నిమిషాలపాటు రైలు నిలిపివేత.. 

కాజీపేటకు 10 గంటలకు చేరుకున్న రైలును తిరిగి 11: 20 నిమిషాలకు రైల్వే జంక్షన్‌ నుంచి పంపించారు. కరోనా అనుమానితులను దవాఖానకు తరలించిన తర్వాత ప్రయాణికులను దింపి భోగీని రైల్వే సిబ్బందితో శుభ్రంగా కడిగించి స్ప్రే చేయించారు. దాదాపు గంట ఇరవై నిముషాలపాటు కొనసాగిన ఉ త్కంఠకు ఎట్టకేలకు తెర పడడంతో రైల్వే అధికారులు, పోలీసులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా సీపీ డాక్టర్‌ రవీందర్‌ ఆదేశాలతో కాజీపేట ఏసీపీ రవీందర్‌కుమార్‌ ఆధ్వర్యంలో కాజీపేట, మడికొండ, ధర్మసాగర్‌ సీఐలు నరేందర్‌, జాన్‌ నర్సింహులు, సాదుల్లా సిబ్బందితో రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. జీఆర్పీ సీఐ వీరస్వామి, ఎస్సై జితేందర్‌, ఆర్పీఎఫ్‌ ఎస్సై లు, రైల్వే సీనియర్‌ డీఎంఈ శ్రీనివాస్‌రావు, ఏవో పూర్ణచందర్‌రావు, అసిస్టెంట్‌ స్టేషన్‌మాస్టర్‌ వెంకటేశ్వర్లు, రవీందర్‌ సీసీఐ రాజగోపాల్‌ స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

హైదరాబాద్‌కు అనుమానితులు..

వరంగల్‌ చౌరస్తా: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కరోనా అనుమానితులుగా గుర్తించిన దంపతులను ఎంజీఎంలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించినట్లు దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. ప్రాథమిక పరీక్షల అనంతరం వారికి ప్రత్యేక గదులను కేటాయించారు. అనంతరం కలెక్టర్‌ ఆదేశాల మేరకు దంపతులను అధికారులు హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం వరంగల్‌ ఎంజీఎం కోవిడ్‌ -19 విభాగం ఐసోలేటెడ్‌ వార్డులో ఉన్న మహిళ రిపోర్టులు నెగటివ్‌గా వచ్చినట్లు వైద్యులు తెలిపారు. శనివారం మొత్తం 38 మంది ఔట్‌ పేషెంట్లు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నట్లు వైద్యులు తెలిపారు. 

ముత్తారంలో కలకలం..!

 భీమదేవరపల్లి: ముత్తారం గ్రామంలో రేణికుంట్ల యాకూబ్‌కు కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వ్యక్తమైంది. గ్రామస్తుల కథనం మేరకు యాకూబ్‌ ఇటీవల గట్లనర్సింగాపూర్‌లో బంధువుల అంత్యక్రియలకు వెళ్లాడు. అక్కడికి కరీంనగర్‌నుంచి బంధువులు రావడం తో వీరంతా కలిసి మద్యం సే వించారు. మరుసటి రోజు నుంచి యాకూబ్‌కు జలుబు, దగ్గు, జ్వరం మొదలైంది. ములుకనూరులోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లగా కరోనా లక్షణాలు ఉన్నట్లు వైద్యులు అనుమానం వ్యక్తం చేయడం తో వెంటనే ఎంజీఎం ద వాఖానకు తరలించారు.  కాగా వైద్య పరీక్షల అ నంతరం యాకూబ్‌కు నె గెటివ్‌ రాగా ఇంటికి పం పించారు. 


logo