శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Mar 21, 2020 , 03:27:53

గ్రామాల సమగ్రాభివృద్ధే కేసీఆర్‌ ధ్యేయం

గ్రామాల సమగ్రాభివృద్ధే కేసీఆర్‌ ధ్యేయం

  • అంతర్గత రోడ్లను బీటీ రోడ్లుగా మార్చుతున్నాం
  • 75 గజాల్లో ఇంటి నిర్మాణానికి ఉచిత అనుమతి 
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • శివాజీనగర్‌ గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ప్రారంభం  

దుగ్గొండి,మార్చి20: గ్రామాల సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, అందుకే గ్రా మపంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని శి వాజీనగర్‌ గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను ప్రా రంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదర్శ గ్రామాల నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపికైన గ్రామాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.  గ్రామా ల్లో వందశాతం మరుగుదొడ్లు, డంపింగ్‌ యా ర్డులు, శ్మశానవాటికలను నిర్మించుకోవాలన్నా రు. కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు సుకినె రాజేశ్వర్‌రావు, రేకంపల్లి ఎంపీటీసీ రంపీస సోనీరతన్‌, పంచాయతీ కార్యద ర్శి వినోద్‌కుమార్‌. సర్పంచ్‌ లింగంపల్లి ఉ మారవీందర్‌రావు, ఉపసర్పంచ్‌ గణేశ్‌, వార్డుసభ్యులు, జీపీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజలకు సౌకర్యంగా అంతర్గత రోడ్లు..

నర్సంపేట,నమస్తేతెలంగాణ: పట్టణాల్లో అంతర్గత రోడ్లను బీటీ రోడ్లుగా మార్చుతున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నా రు. శుక్రవారం నర్సంపేట పట్టణంలో నిర్మించిన, నిర్మిస్తున్న తారు రోడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు బీటీ  రోడ్లను వేయిస్తున్నామన్నారు. గతంలో పట్టణంలోని ఈ రోడ్లు గుంతలు పడి అధ్వానంగా తయారయ్యాయన్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం పట్టణంలోని 14 కిలో మీ టర్ల అంతర్గత రోడ్లను బీటీ రెన్యువల్‌ చేయించేందుకు పనులు, నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ప్రస్తుతం పనులు పూర్తి దశలో ఉన్నాయన్నారు. నర్సంపేట పట్టణాన్ని ఆదర్శంగా  తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నర్సంపేటకు ప్రత్యేక  నిధులు కేటాయించారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ గుంటి రజినీకిషన్‌, రైతు సమన్వయ సమితి రాష్ట్ర సభ్యుడు రాయిడి రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్‌ రాయిడి కిర్తీదుశ్యంత్‌రెడ్డి, పైడయ్య తదితరులు పాల్గొన్నారు.


logo