కొవిడ్-19 ఎఫెక్ట్

నేటి నుంచి పలు రైళ్లు రద్దు
కాజీపేట, మార్చి19: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19 వైరస్ దేశంలో వ్యాప్తి చెందకుండా దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాజీపేట రైల్వే జంక్షన్, వరంగల్ రైల్వే స్టేషన్ల మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు.
రద్దయిన రైల్లు ఇవే..
రైలు నంబర్ 11303/11304 కొల్లాపూర్-మణుగూర్-కొల్లాపూర్ మధ్య నడిచే కొల్లాపూర్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20 నుంచి 01వ తేదీ వరకు రద్దు.
కాజీపేట రైల్వే జంక్షన్ -లోకమాన్య తిలక్ టర్మినల్ స్టే షన్- కాజీపేట రైల్వే జంక్షన్ల మధ్య నడిచే 11 083/11084 వారాంతపు తడోబా ఎక్స్‌ప్రెస్ రైళ్ల ను రద్దు చేశారు. తడోబా రైలును ఈ నెల 20, 27వ తేదీ వరకు, లోకమాన్య తిలక్‌ను ఈ నెల 21, 28వ తేదీ వరకు నిలిపివేయనున్నారు.
విశాఖ పట్నం-సికింద్రాబాద్ మధ్య కాజీపేట రైల్వే జంక్షన్ మీదుగా నడిచే రైలు నంబర్ 08501 స్పెషల్ రైలును ఈ నెల 24, 31తేదీల్లో ఆపివేస్తున్నారు.
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడిచే రైలు నంబర్ 08502 స్పెషల్ రైలును రద్దు చేశారు. భువనేశ్వర్-సికింద్రాబాద్ మధ్య నడిచే రైలు నంబర్ 08407 /08408 ఏసీ స్పెషల్‌ను ఈ నెల 20, 27 తేదీల్లో రద్దు చేశారు.
వరంగల్ రైల్వే స్టేషన్ మీదుగా మద్రాస్ నుంచి హజ్రత్ నిజాముద్దీన్- మద్రాస్ వరకు నడిచే రైలు నంబర్ 12269/12270 హజ్రత్ నిజాముద్దీన్ దురంతో సూపర్ ఫాస్ట్ రైళ్లను 27, 28,30,31 తేదీల్లో రద్దు చేశారు.
తాజావార్తలు
- రాష్ర్టంలో కరోనా టీకా తీసుకున్న తొలి మహిళ ఈమెనే
- చనిపోయిన పెంపుడు శునకానికి ఎంత గొప్ప సంస్కారం..!
- రష్యా ఎస్-400 మిస్సైల్ కొనుగోళ్లపై అభ్యంతరం
- లాక్‌డౌన్‌తో ప్రాణాలను కాపాడుకున్నాం : ప్రధాని మోదీ
- తెలంగాణలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం
- కరోనా ఖతం.. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రారంభించిన మోదీ
- దేశంలో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు
- రాష్ర్టంలో కొత్తగా 249 కరోనా కేసులు
- రోహిత్ శర్మ ఔట్.. ఇండియా 62-2
- హార్ధిక్ పాండ్యా తండ్రి కన్నుమూత..