సోమవారం 25 మే 2020
Warangal-rural - Mar 20, 2020 , 02:25:50

రికార్డుకు రెడీ..!

రికార్డుకు రెడీ..!

  • పౌరసరఫరాల శాఖ సన్నాహాలు
  • ఏప్రిల్‌ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు 
  • యాసంగి ధాన్యం సేకరణకు యాక్షన్‌ ప్లాన్‌
  • 1.80 లక్షల టన్నుల కొనుగోలుకు అంచనా
  • ఒక సీజన్‌లో ఇంత ధాన్యం కొనడం ఇదే ఫస్ట్‌
  • గత వానాకాలంలో కొన్న ధాన్యం 1.77 లక్షల టన్నులే
  • ఈ సారి కొనుగోలు కేంద్రాల పెంపునకు ఛాన్స్‌
  • ధాన్యం బాయిల్డ్‌ మిల్లులకు కేటాయించే ప్రతిపాదన

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ రికార్డు సృష్టించబోతున్నది. జిల్లాలో రైతుల నుంచి 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణకు ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి పంపింది. జిల్లా ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా ఒక సీజన్‌లో ఇంత ధాన్యం కొనుగోలుకు సమాయత్తం అవుతుండడం విశేషం. జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవడం, ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు చెరువుల్లోకి చేరుతుండడంతో గత వానాకాలంలో 1.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు 1.77 లక్షల టన్నులను కొన్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో 1.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సోమవారం అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి నిర్వహించిన సమా వేశంలో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారులు అందజేశారు. ఈ సారి కేంద్రాలు పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ధాన్యం కొనుగోలు మొదలు కానుంది. ఈ ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) కోసం జిల్లాలోని 27 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు కేటాయించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

వరంగల్‌ రూరల్‌ జిల్లా ప్రతినిధి/నమస్తే తెలంగాణ: యాసంగి ధాన్యం కొనుగోలులో పౌరసరఫరాల శాఖ రికార్డు సృష్టించ బోతుంది. ప్రస్తుత రబీ సీజన్‌లో జిల్లాలో రైతుల నుంచి నేరుగా 1.80 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని అంచనా వేసింది. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వానికి పంపింది. జిల్లా ఆవిర్భవించిన తర్వాత ఒక సీజన్‌లో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ 1.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సమాయత్తం అవుతుండటం ఇదే తొలిసారి కావటం విశేషం. చివరిసారి గత వానాకాలం సీజన్‌లో జిల్లాలో 1.77 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. జిల్లాల పునర్విభజన జరిగిన తర్వాత గత నాలుగేళ్లలో పౌరసరఫరాల శాఖ ఒక సీజన్‌లో ఇంత ధాన్యం కొనటం ఇదే ప్రధమం. జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురవటం, గతంలో ఎప్పుడూ లేని రీతిలో ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు చెరువుల్లోకి చేరుతుండటం వల్ల గత వానాకాలంలో రైతుల నుంచి 1.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని సివిల్‌ సప్లయ్‌ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ధాన్యం కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా 113 కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రభుత్వ మద్ధతు ధరతో రైతుల నుంచి నేరుగా 1.77 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. ప్రస్తుత రబీ సీజన్‌లో ఖరీఫ్‌ కంటే ఎక్కువ ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే మునుపెన్నడూ లేని రీతిలో రైతులు జిల్లాలో ఈ యాసంగి లో అధిక విస్తీర్ణంలో వరి పంట సాగు చేశారు. సుమారు 65 వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంట సాగైనట్లు వ్యవ సాయ శాఖ అధికారులు గుర్తించారు. దాదాపు రెండు లక్షల టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి తన చాంబర్‌లో యాసంగి ధాన్యం కొనుగోలుపై నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ శాఖ అధికారులు ఇదే చెప్పారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా కాళే శ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నీరు చెరువుల్లోకి వస్తుండటం వల్ల గతంలో ఎప్పుడూ లేని విధంగా చెరువుల కింద ఈ సారి రైతులు వరి పంట సాగు చేశారని తెలిపారు. ప్రధా నంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీరు చెరువుల్లో నిండి ఉండటం వల్ల భూగర్బ జలమట్టం పెరగటంతో వ్యవసాయ బావులు, బోర్ల కింద కూడా రైతులు వరి పంట సాగు చేసి నట్లు విశ్లే షించారు. ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎస్సారెస్పీ కా ల్వల ద్వారా జిల్లాలోని చెరువుల్లోకి వస్తుంది. దీంతో యాసంగి వరి పంట నుంచి రైతులకు ఆశించిన దిగుబడు లు కచ్చితంగా రావొచ్చని అధికారులు విశ్వసిస్తున్నారు.

ధాన్యం కొనుగోలుకు ప్లాన్‌

వ్యవసాయశాఖ అధికారులు ప్రస్తుత యాసంగి సీజన్‌లో జిల్లాలో రెండు లక్షల టన్నుల ధాన్యం దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నప్పటికీ పౌరసరఫరాల శాఖ అధికారులు 1.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు యాక్షన్‌ ప్లాన్‌ తయారు చేశారు. ఎందుకంటే రైతులు కొందరు తమ ధాన్యాన్ని మార్కెట్‌లో విక్రయించే అవకాశం ఉన్నందున సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ ద్వారా 1.80 లక్షల టన్నులు కొ నాల్సి వస్తుందని చెపుతున్నారు. ఈ మేరకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను సోమవారం అదనపు కలెక్టర్‌ మహేందర్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో సివిల్‌ సప్లయ్‌ కార్పొరేషన్‌ అధికారులు అందజేశారు. గత వానాకాలం నిర్వహించిన 113 ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిరిగి యాసంగి సీజన్‌లోనూ కొనసాగించేందుకు ప్రతిపాదిం చారు. ఈ 113 సెంటర్లలో అత్యధికంగా ప్రాధమిక వ్యవ సాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌)  70 ఉన్నాయి. ఐకేపీ సెంటర్లు 41 ఉంటే 1 జీసీసీ, 1 మెప్మా సెంటరు ఉన్నట్లు పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజరు(డీఎం) భాస్కర్‌ తెలిపారు. పరకాలలో పనిచేసిన మెప్మా సెంటర్‌ను రద్దు చేసే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. మరికొన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు కొత్తగా ప్రతిపాదనలు వస్తున్నందున యాసంగి సీజన్‌లో జిల్లాలో 113కు పైగా సెంటర్లు పనిచేసే అవకాశం లేకపోలేదు. అధికారులు కూడా ఇదే చెబుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు. ప్ర స్తుతం మాత్రం యాసంగి సీజన్‌లో 113 కేంద్రాల ద్వారా 1.80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్లాన్‌ చేశారు. 

ఏప్రిల్‌ నుంచి కొనుగోలు

ఈ మేరకు గన్నీ సంచులు, 113 కొనుగోలు కేంద్రాల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, ఇతర పరికరాలను సమకూర్చుకునే పనిలో పడ్డారు. ఏప్రిల్‌ రెండో వారం నుంచి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు మొదలు కా నుందని అధికారులు చెపుతున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత 2018 యాసంగి సీజన్‌లో జిల్లాలో 1.35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. అనంతరం 2019 రబీ సీజ న్‌లో ధాన్యం కొనుగోలు 1.30 లక్షల టన్నులకు తగ్గింది. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ధాన్యం కొనుగోలు 1.80 లక్షల టన్నులకు ఎగబాకనుంది. ఇకనుంచి ప్రతి సం వత్సరం వానాకాలం, యాసంగి సీజన్లలో ధాన్యం కొను గోలు ఇంతకంటే తగ్గకపోవచ్చని అధికారులు భావి స్తున్నారు. కాళే శ్వరం ప్రాజెక్టు నీరు జిల్లాకు రావటం మొదలైనందున వానాకాలం, యాసంగిలో గాని వరి పంట విస్తీర్ణం తగ్గకపో వచ్చని విశ్వసిస్తున్నారు. ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో రైతుల నుంచి నేరుగా కొనే ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కోసం జిల్లాలోని 27 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు కేటాయించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు.logo