శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Mar 10, 2020 , 02:38:45

ఆలయాన్ని మరో యాదాద్రిగా అభివృద్ధి చేస్తా

ఆలయాన్ని మరో యాదాద్రిగా అభివృద్ధి చేస్తా

రేగొండ, మార్చి 09 : కొడవటంచ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని యాదాద్రిగా అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని కొడవటంచ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో ఈ నెల 4 నుంచి 11 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా 9 నుంచి 11వ తేదీ వరకు జాతర ఉత్సవాలు నిర్వహిస్తారు. హోలీ పండుగ రోజున  సోమవారం జాతర ప్రారంభం, రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  ఎమ్మెల్యే గండ్ర హాజరై రథాన్ని లాగి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ చైర్మన్‌ హింగె మహేందర్‌, ఈవో సులోచన, పూజారులు పూర్ణకుంభంతో  స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహకారంతో పవిత్ర పుణ్యక్షేత్రమైన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మరో యాదాద్రిగా అభివృద్ధి చేస్తానన్నారు. ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ.2.5కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో ప్రాకార మండపం, కల్యాణ మండపం, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో సీఎం సహకారంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే పెద్ద క్షేత్రంగా అభివృద్ధి చేస్తానన్నారు. లక్ష్మీనరసింహస్వామి అత్యంత మహిమ గల వాడని, ఆయనను ఈ ప్రాంత ప్రజలు ఇలవేల్పుగా భావిస్తారని అన్నారు.  అందుకని ఈ దేవాలయానికి పర్యాటక హోదా కల్పిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, శ్రీరాంరెడ్డి, ఏఎస్పీ శ్రీనివాసులు, జెడ్పీటీసీ సాయిని విజయ ముత్యం, ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు మోడెం ఉమేశ్‌ గౌడ్‌, నాయ కులు మైస భిక్షపతి, రవి, నర్సింగారావు, కొల్గూరి రాజేశ్వర్‌ రావు, రవీందర్‌రావు, శ్రీనివాస్‌, రజినీకాంత్‌, రంజిత్‌కుమార్‌ పాల్గొన్నారు. 


logo