శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Mar 09, 2020 , 03:50:44

సృష్టికి మూలం మహిళ

సృష్టికి మూలం మహిళ

రాయపర్తి, మార్చి 8 : సృష్టికి మూలం మహిళ అని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృ ద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆదివారం మండ ల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ జినుగు అనిమిరె డ్డి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్స వం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి గా హాజరైన ఆయన మాట్లాడుతూ.. సృష్టిలో ఓర్పు, నేర్పు, ఓదార్పు, సహనం, దయ, ప్రే మ, వాత్సల్యం అనే పదాలకు నిలువెత్తు సజీ వ సాక్ష్యం స్త్రీ అన్నారు. మహిళల సహకారం లేనిది సమాజంలో ఏ వ్యక్తి విజేతగా నిలువలేరని వివరించారు. వేదాల కాలం నుంచి ఇ ప్పటి వరకు మహిళలు సమాజాభివృద్ధి, భర్త సాధించే ప్రతీ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. రాష్ట్రంలోని మహిళలు, ఆడబిడ్డలందరికి సీఎం కేసీఆర్‌ దేవుడిచ్చిన అన్న అని, ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డల వివాహాల కోసం లక్షలాది రూపాయలు అందిస్తు న్న ఘనత కేవలం కేసీఆర్‌కే దక్కుతుందన్నా రు. భవిష్యత్తులో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల్లో మహిళలను భాగస్వాములను చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

అమ్మ ఆశీర్వాదంతోనే మంత్రినయ్యా..

తనకు జన్మనిచ్చిన ఎర్రబెల్లి ఆదిలక్ష్మి-జగన్నాథరావుల రుణం తీర్చుకోలేనిదని, మాతృమూర్తి ఆదిలక్ష్మి ఆశీర్వాదంతోనే తాను 35 ఏళ్లుగా రాజకీయాల్లో ఎదుగుతూ వస్తున్నానన్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదం, సీఎం కేసీఆర్‌ సంపూర్ణ సహకారంతో ప్రభుత్వంలో కీలక స్థాయిలో పని చేస్తున్నట్లు చెప్పారు. 

మహిళాభివృద్ధికి పెద్ద పీట..

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో లేని వి ధంగా రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల నియామకాల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ఆయన చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, అమ్మ ఒడి, షీ టీమ్స్‌ వంటి పథకాలతో మహిళలను ఆదరించిన సర్కార్‌ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు. అనంతరం మండలంలోని 39 గ్రామాల పరిధిలో 65కుటుంబాలకు మంజూరైన రూ. 63,59,308ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం జరిగిన సభ లో మంత్రి దయాకర్‌రావు సతీమణి, ఎర్రబె ల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు మాట్లాడి పలు రంగాల్లో వి శేష సేవలందిస్తున్న మహిళలను ఘనంగా స త్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చా ర్జి కలెక్టర్‌ రావుల మహేందర్‌రెడ్డి, ఆర్‌డీవో మహేందర్‌జీ, తహసీల్దార్‌ కుసుమ సత్యనారాయణ, జెడ్పీటీసీ రంగు కుమారస్వామిగౌడ్‌, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్‌ ఆకుల సురేందర్‌రావు, డీఎల్‌పీవో నా గపురి స్వరూప, శివ ప్రసాద్‌, గారె నర్సయ్య, అయిత రాంచందర్‌, బిల్ల రాధిక, కుందూరు రాంచంద్రారెడ్డి, రమేశ్‌రెడ్డి, నర్మద, కాంచనపల్లి వనజారాణి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మహిళా ఉద్యోగులు, అంగన్‌వాడీ టీచర్‌లు, ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


logo