బుధవారం 03 జూన్ 2020
Warangal-rural - Mar 09, 2020 , 03:47:21

నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు కేటాయిస్తున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం  మండలంలోని హైబొత్‌పల్లిలో రూ.29 లక్షలతో  నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రతీ గ్రామంలో మౌళిక సదుపాయాల కల్పన కోసం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని పక్కాగా అమలుచేయడం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కంచె కుమారస్వామి, జెడ్పీటీసీ చిలువేరు మొగిళి, ఎంపీపీ తక్కళ్లపల్లి స్వర్ణలత, పరకాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ బొజ్జం రమేశ్‌, మాదారం పీఏసీఎస్‌ చైర్మెన్‌ నల్లెల్ల లింగమూర్తి, ఎంపీటీసీ పల్లెబోయిన సునిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్‌గౌడ్‌, నాయకులు గురిజపల్లి ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి పంటకు కాళేశ్వరం నీళ్లు

దామెర : రైతాంగం పండించే ప్రతీ పంటకు కాళేశ్వరం నీళ్లను అందించి పంట ఉత్పత్తులను పెంచేందుకు  తగిన చర్యలు తీసుకున్నామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో  మండలంలోని తక్కళ్లపహాడ్‌లో రూ.20లక్షలు, ఒగ్లాపురంలో రూ.5 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల అభివృద్ధి పనుల శిలాఫలకాలను ఆవిష్కరించి, అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పరకాల నియోజకవర్గ అభివృద్ధికోసం సీఎం కేసీఆర్‌ అనేక  నిధులను కేటాయించి అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ప్రతీ గ్రామం అభివృద్ధి పథాన నడువడానికి సీఎం ప్రత్యేక కృషి కారణమన్నారు.  కార్యక్రమంలో జెడ్పీటీసీ గరిగె కల్పన, కృష్ణమూర్తి, ఎంపీపీ కాగితాల శంకర్‌, వైస్‌ ఎంపీపీ జాకీర్‌ అలీ, పీఏసీఎస్‌ చైర్మన్‌ బొల్లు రాజు, సర్పంచ్‌లు బింగి రాజేందర్‌, కేతిపల్లి సరోజన, శ్రీధర్‌ రెడ్డి, పున్నం రజిత, పుల్యాల రాణి, రఘుపతిరెడ్డి, విష్ణువర్థన్‌ రెడ్డి, అశోక్‌, శ్రీనివాస్‌, పురాణం రేశ్వరి, ఈశ్వర్‌, ఎంపీటీసీలు గండు రామకృష్ణ, దుబాసి శ్రీలత, రాధాకృష్ణ, కృపాకర్‌ రెడ్డి, సంధ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కమలాకర్‌, సంపత్‌, మాజీ ఎంపీటీసీ రమేశ్‌, ఉపసర్పంచ్‌లు విజేందర్‌, కుమారస్వామి,  నర్సయ్య, కృష్ణమూర్తి, భిక్షపతి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు

గీసుగొండలో : తెలంగాణ ప్రభుత్వం పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మరియపురం,కోనాయిమాకుల గ్రామాల్లో ఆదివారం రూ.83 లక్షలతో నిర్మించిన అంతర్గాత సీసీ రోడ్డు పనులతో పాటు మరియపురంలో రూ  2,65 లక్షలతో నిర్మించిన డంపింగ్‌ యార్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పోలీసు ధర్మారావు, కుడా డైరెక్టర్‌ వీరగోని రాజుకుమార్‌, సర్పంచులు అల్లం బాలిరెడ్డి, డోలిరాధాబాయి, ఎంపీటీసీ బేతినేని వీరరావు, ఊకల్‌ సహకార సంఘం చైర్మన్‌ మండల వీరస్వామి, సర్పంచులు బాబు, పూండ్రు జైపాల్‌రెడ్డి, ప్రకాశ్‌, మల్లారెడ్డి, నాగేశ్వర్‌రావు, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, మండల పంచాయతీ అధికారి శేషాంజన్‌స్వామి, ఉపసర్పంచులు  రమేశ్‌, రాజు,  నాయకులు డోలి చిన్ని, రమేశ్‌, రాజేశ్వర్‌రావు, రమేశ్‌, సంపత్‌, ధనుంజేయ్‌, రాంబాబు, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

పరకాలటౌన్‌లో..

పరకాల టౌన్‌ : రాష్ట్రంలోని పేద వారికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం పరకాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  బాధితులకు రూ.1.54లక్షల విలువ చేసే ఎల్‌వోసీలను అందించారు. కార్యక్రమంలో పరకాల మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్‌ రెడ్డి,  నాయకులు సోద రామకృష్ణ, బండి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. 

ఆత్మకూరులో...

 ఆత్మకూరు :   మండలంలోని అక్కంపేట, మల్కపేట గ్రామాల్లో రూ.25లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.   గ్రామాల్లో మౌళిక సదుపాయాలకు కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.  కార్యక్రమంలో కుడా డైరెక్టర్‌ ఎనకతళ్ల రవీందర్‌, ఎంపీపీ మార్క సుమలత, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక, వైస్‌ ఎంపీపీ రేవూరి సుధాకర్‌రెడ్డి, గూడెప్పాడ్‌ మార్కెట్‌ చైర్మన్‌ కాంతాల కేశవరెడ్డి, సర్పంచ్‌లు  విజయహంసాల్‌రెడ్డి, మాడిశెట్టి వేణుగోపాల్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు లేతాకుల సంజీవరెడ్డి,  ప్రధానకార్యదర్శి బొల్లెబోయిన రవియాదవ్‌,  నాయకులు అంకతి రవి, మామిడిపెల్లి రవీందర్‌, కక్కెర్ల రాజు, మార్క రజనీకర్‌ పాల్గొన్నారు. 

నడికూడలో...

నడికూడ :  మండలంలోని హైబోత్‌పల్లి, చర్లపల్లి, ధర్మారం గ్రామాల్లో రూ.80 లక్షల  నిధులతో నిర్మించిన  సీసీ రోడ్లను  ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.  కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.


logo