శుక్రవారం 29 మే 2020
Warangal-rural - Mar 09, 2020 , 03:41:21

రైతులు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవాలి

 రైతులు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవాలి

ఖానాపురం,మార్చి 08: ఖానాపురం సహకార సంఘంలో  స్వల్ప కాలిక రుణాలు పొందిన రైతులు రుణమాఫీ కోసం ఈ నెల 11 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఓడీసీఎంఎస్‌ చైర్మన్‌ గుగులోత్‌ రామస్వామి నాయక్‌ అన్నారు. ఈ మేరకు ఆదివారం సొసైటీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘం నుంచి రుణాలు పొందిన రైతులు ఆధార్‌కార్డు జిరాక్స్‌, పట్టాదార్‌పాస్‌పుస్తకం జిరాక్స్‌, డీసీసీబీ జిరాక్స్‌లతో పాటు ఫోన్‌ నంబర్‌తో సంబంధిత సొసైటీలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. స్థానిక సొసైటీ పరిధిలో 2314 మంది రైతులు రూ.3.30 కోట్ల రుణాలను పొంది ఉన్నారని, వీరు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సహకార సంఘం ద్వారా రైతులకు సరిపడ యూరియాను అందిస్తున్నామని తెలిపారు. ఓడీసీఎంఎస్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆశీస్సులతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను తీసుకురానున్నామన్నారు. సమావేశంలో సొసైటీ వైస్‌ ఛైర్మన్‌ దేవినేని వేణుకృష్ణ, ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, నర్సంపేట మున్సిపాలిటీ వైస్‌ ఛైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, మాజీ మార్కెట్‌ ఛైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌,డైరెక్టర్‌ వేములపల్లి సునీత, సదర్‌లాల్‌, అశోక్‌, బాబురావు, బాలు తదితరులు పాల్గొన్నారు.


logo