చెన్నకేశవ స్వామి జాతర షురూ..

దామెర, మార్చి 07 : ఆపద మొక్కులవాడు.. అనంత పద్మనాభుడిగా భక్తులు కొలిచే చంద్రగిరి చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 07 నుంచి ఈ నెల 22వ తేదీ వరకు జరుగనున్నాయి. మండంలోని కోగిల్వాయిలో కలియుగ దైవంగా భక్తులకు చంద్రగిరి చెన్నకేశవస్వామి దర్శనం ఇవ్వనున్నారు.రెండో తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన శ్రీచంద్రగిరి చెన్నకేశవస్వామి ఆలయంలో కొలువై ఉన్న స్వామిని దర్శించుకునేందుకు వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. చంద్రగిరి గుట్టలపై శ్రీమన్నారాయణుడి అవతారంలో ద్వాపార యుగంలో ఈ చెన్నకేశవస్వామి వారు వెలిశారని భక్తుల విశ్వాసం. శ్రీదేవి, భూదేవి సహితంగా వెలసిన చంద్రగిరి చెన్నకేశవస్వామి భక్తుల నుంచి విశేష పూజలందుకుంటూ భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. అందుకే ఈ ఆలయం రెండో తిరుమల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిందని ప్రజలు పేర్కొంటున్నారు. 12వ శతాబ్దంలో కాకతీయులు స్వామివారి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్ర ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి.
పూర్తిగా రాయితో నిర్మించిన చంద్రగిరి చెన్నకేశవస్వామి ఆలయం సమీపంలోనే ఇప్పటికీ ఏడు గుండాలు (కోనేరులు) ఉండడం విశేషం. పురాణ ఇతిహాసమైన భాగవతంలో గజేంద్రమోక్షం చెన్నకేశవస్వామి గుట్టలపై జరిగిందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న కోనేరులో గజేంద్రుడు నీళ్లు తాగడానికి వెళ్లగా కోనేరులో ఉన్న మొసలి గజేంద్రుడి కాలుపట్టుకుని లాగగా ప్రాణరక్షణ కోరుతూ గజేంద్రుడు శ్రీమన్నారాయణుడిని ప్రార్థిస్తాడు. గజేంద్రుడి కోరికను తీర్చేందుకు స్వయంగా శ్రీమన్నారాయణుడే చెన్నకేశవస్వామి అవతారంలో ప్రత్యక్షమై ముసలి నుంచి గజేంద్రుడి ప్రాణాలను కాపాడడని ప్రతీతి. శాసనాలు, చరిత్రకూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం పాల్గున శుద్ధ త్రయోదశి నుంచి ఫాల్గున బహుళ త్రయోదశివరకు గుట్టపై స్వామివారి జాతర జరుగుతుంది.
రేపు స్వామి వారి కల్యాణం..
9వ తేదీన పౌర్ణమి రోజు శ్రీదేవి, భూదేవిసహితంగా స్వామి వారి కల్యాణం కన్నులపండువగా జరుగుతుంది. 22వ తేదీన స్వామివారు గుట్టపై నుంచి డప్పుచప్పుళ్ల మధ్య గ్రామంలోని ఆలయానికి చేరుకుంటారు.
తాజావార్తలు
- సంపూర్ణేశ్ స్టంట్ చేస్తుండగా ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్గా సంగక్కర
- శరీరంలో ఈ 7 అవయవాలు లేకున్నా బతికేయొచ్చు!!
- వ్యాక్సిన్ల సామర్థ్యంపై బ్రిటన్ మంత్రి హెచ్చరిక
- కాలా గాజర్.. ఆరోగ్య సమస్యలు పరార్
- ఎస్సీ, ఎస్టీలకు ఇంటింటికి కొత్త పథకం : మంత్రి ఎర్రబెల్లి
- శ్రీష్టి గోస్వామి.. ఒక్క రోజు సీఎం
- బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే మసీదులు కూల్చడం ఖాయం