వర్షానికి దెబ్బతిన్న పంటల పరిశీలన

నర్సంపేట రూరల్, మార్చి07: గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈక్రమంలో శనివారం మండలంలోని గురిజాల, చిన్న గురిజాల, జీజీఆర్పల్లి, గుంటూర్పల్లి గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న వివిధ రకాల పంటలను మండల వ్యవసాయ అధికారులు, గురిజాల పీఏసీఎస్ పాలకవర్గం పరిశీలించింది. నర్సంపేట ఏవో కృష్ణకుమార్, గురిజాల పీఏసీఎస్ చైర్మన్ ఆకుల రమేశ్ ఆధ్వర్యంలో పుచ్చతోటలు, మొక్కజొన్న, అరటి, బొబ్బాయి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టాన్ని అధికారులు అంచనా వేశారు. అనంతరం గురిజాల పీఏసీఎస్ చైర్మన్ రమేశ్ మాట్లాడుతూ రైతులు అధైర్య పడొద్దన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బండారు శ్రీలత-రమేశ్, ఏఈవోలు మెండు అశోక్, సింధూకిరణ్మయి, భరత్, నవీన్, పీఏసీఎస్ డైరెక్టర్లు నామల సోమయ్య, బొల్లం మోహన్రావు, ఎడ్ల రవీందర్, వార్డు సభ్యులు రామ్రాజ్, గడ్డం కొంరయ్య, వెంకటేశ్వర్లు, అల్లి రవి, అయిలయ్య, వీరస్వామి, కట్టయ్య, రామయ్య, బుజ్జయ్య, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పోలీసుల కవాతు పరిశీలన
- ఆపదలో షీటీమ్లను ఆశ్రయించాలి
- రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
- స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయండి: కలెక్టర్
- వాలీబాల్ C/O ఇనుగుర్తి
- సమస్యలు పరిష్కరిస్తా : జడ్పీ చైర్మన్
- అప్రమత్తంగా ఉండాలి : ఎస్పీ
- సీసీ రోడ్డు పనులు ప్రారంభం
- ‘బాలికలు అద్భుతాలు సృష్టించాలి’
- బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం