అకాల వర్షం.. అపార నష్టం

నర్సంపేట రూరల్, మార్చి 6 : ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం ప్రజలు, రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించింది. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి వివిధ రకాల పంటలకు నష్టం జరిగింది. పలు గ్రామాల్లో వందల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలవాలింది. మండలంలోని ముగ్ధుంపురం, మాధన్నపేట, లక్నెపల్లి గ్రామాల్లోని మామిడి తోటలకు భారీ నష్టం సంభవించింది. మామిడికాయలు నేలరాలాయి. గురిజాల, గుర్రాలగండిరాజపల్లి, చిన్న గురిజాల, గుంటూర్పల్లి, మాధన్నపేట, మహేశ్వరం, ఇటుకాలపల్లి, ముత్తోజిపేట గ్రామాల్లో మొక్కజొన్న పంట ధ్వంసమైంది. పసుపు, అరటితోటలకు కూడా నష్టం వాటిల్లింది. కాగా, వర్షానికి దెబ్బతిన్న పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
పంటల పరిశీలన..
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను శుక్రవా రం మండల వ్యవసాయ అధికారులు పరిశీలించా రు. గురిజాల, జీజీఆర్‌పల్లి, చిన్న గురిజాల, మాధన్నపేట గ్రామాల్లో పంటలను పరిశీలించారు. పం ట నష్టాన్ని అంచనా వేశారు. ఈకార్యక్రమంలో ఏ వో కృష్ణకుమార్, ఏఈవోలు మెండు అశోక్, సిం ధూకిరణ్మయి, భరత్, నవీన్, రైతులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని భాంజీపేట, కమ్మపల్లి, దాసరిపల్లి, భోజ్యనాయక్తండాల్లో అకాల వర్షాలకు దెబ్బతిన్న మిర్చి రాశులను టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నామాల సత్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు పరిశీలించారు. ఈకార్యక్రమంలో మండల ప్రధానకార్యదర్శి ఈర్ల నర్సింహరాములు, నాయకులు కట్ల సుదర్శన్‌రెడ్డి, రాము, బోరగాని కృష్ణ, రణధీర్‌కుమార్, రాజమౌళి, రాజేశ్వరరావు, శంకర్లింగం పాల్గొన్నారు.
సంగెంలో..
సంగెం : ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతను అతలాకుతలం చేసింది. మొక్కజొన్న చేన్లు పీచుకు వచ్చిన సమయంలో రాకాసి వాన వచ్చి పంటను చేతికి రాకుండా చేసిందని అ న్నదాతలు బోరున విలపిస్తున్నారు. పత్తి పంట సరి గ్గా పండకపోవడంతో దాన్ని తీసేసి మొక్కజొన్నను వేసుకున్నామని, ఇప్పుడు అకాల వర్షం కొంప ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
మొక్కజొన్నను పరిశీలించిన ఏవో..
అకాల వర్షానికి గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్నను మండల వ్యవసాయాధికారి యాకయ్య పరిశీలించారు. మండలంలోని మొండ్రాయి, నార్లవాయి, నల్లబెల్లి, పల్లార్గూడ, కాట్రపల్లి, సంగెం, వెంకటాపురం గ్రామాల్లో పరిశీలించారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని ఏవో యాకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు సాగర్, సంధ్య, సమత, చందన, రైతులు పాల్గొన్నారు.
గీసుగొండలో..
గీసుగొండ : మండలంలో మొక్కజొన్న, అరటి పంటలు నేలమట్టమయ్యాయి. మొక్కజొన్న పంట చేతికందే సమయంలో నేలమట్టమవటంతో రైతు లు ఆవేదన చెందుతున్నారు. మండలంలో 12.8 శాతం వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కల్లాలో ఉన్న మిర్చి, మక్కలు తడిముద్దయ్యాయి. మండలంలో సుమారు 60 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.
చెన్నారావుపేటలో..
చెన్నారావుపేట : అకాల వర్షంతో మండలంలోని ఉప్పరపల్లి, లింగాపురం, కోనాపురం, కాల్నాయక్తండాల్లో మొక్కజొన్న పంట నేల వాలిం ది. కాగా, నేల వాలిన మొక్కజొన్న పంటలను శుక్రవారం ఎంపీపీ బాదావత్ విజేందర్, మండల వ్యవసాయాధికారి కర్పూరపు అనిల్‌కుమార్, ఏఈవో లు వినయ్, రఘుపతి పరిశీలించారు. అకాల వర్షం తో మొత్తం 1180 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచానా వేసినట్లు తెలిపారు. రైతులకు నష్ట పరిహారం అందేవిధంగా కృషి చేస్తామని ఎంపీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు పెరుమాండ్ల శ్రీధర్‌రెడ్డి, వెల్దె సుజాత, సారంగం, తప్పెట రమేశ్, ఎంపీటీసీలు చెరుకుపెల్లి విజేందర్‌రెడ్డి, పసునూటి రమేశ్, గుండాల మహేందర్, చెన్నారావుపేట సొసైటీ వైస్ చైర్మన్ చింతకింది వంశీ, రాజులపాటి ఐలయ్య, రైతు సమన్వయ సమితి బాధ్యులు, రైతులు పాల్గొన్నారు.
దుగ్గొండిలో..
దుగ్గొండి : అకాల వర్షంతో మండలంలో పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిని రైతన్నలకు తీవ్ర న ష్టం వాటిల్లింది. మండలంలోని తిమ్మంపేట, రేఖంపల్లి, మదిర మందపల్లి, రాజ్యాతండ, నాచినపల్లి తదితర గ్రామాల్లో మిర్చి, మొక్కజొన్న చేన్లు దెబ్బతిన్నాయి. ఆరుకాలం కష్టించి పండించిన పంట చే తికందే సమయానికి వడగండ్ల వానతో తీవ్ర నష్టం వాటిల్లిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. కా గా, దెబ్బతిన్న పంటలను నర్సంపేట ఏడీఏ శ్రీనివాసరావు, మండల వ్యవసాయాధికారులు పరిశీలించారు. అనంతరం ఏడీఏ మాట్లాడుతూ.. పంట న ష్టం వివరాలను ఉన్నతాధికారులను పంపిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట కోమలాభద్రయ్య, వైస్ ఎంపీపీ పల్లాటి జైపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజేశ్వర్‌రావు, ఏవో దయాకర్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఏఈవోలు పాల్గొన్నారు.
ముదిగొండలో..
నెక్కొండ : మండలంలోని ముదిగొండలో గాలివానతో మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎంపీపీ జాటోత్ రమేశ్ శుక్రవారం దెబ్బతిన్న పంటచేలను ఏఈవో వసంత, హరిశ్చంద్రుతండా సర్పంచ్ వీరూనాయక్తో కలిసి పరిశీలించారు. జాటోత్ చంద్రు, రాజు, ఎల్లయ్య, తిరుపత మ్మ, ఉమ, నర్సింహా, బిచ్చా, మల్లయ్య, బా వుసింగ్, యాకుబ్ ఎల్లస్వామిలకు చెందిన పంటకు నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీపీ కోరారు.
తాజావార్తలు
- సీడీకె గ్లోబల్ వర్ట్యువల్ కన్వర్జెన్స్ -2021
- కరోనా క్రైసిస్ ఉన్నా.. స్టార్టప్‌లు భేష్!!
- బంద్ కానున్న గూగుల్ డ్యుయో సేవలు..?
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక