విద్యార్థులు సాంకేతిక రంగాల్లో రాణించాలి

నర్సంపేట రూరల్, మార్చి 06: విద్యార్థులు సాంకేతిక రంగాల్లో రాణించాలని వరంగల్ నిట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్వీ రమణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని లక్నెపల్లి శివారు బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలలో జాతీయ సాంకేతిక సదస్సు శ్రేష్ట-2020 కార్యక్రమం ఘనంగా జరిగింది. బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నిట్ ప్రొఫెసర్ హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని వెలికితీయడానికి ఇలాంటి జాతీయ సదస్సులు ఎంతో ఉపయోగపడుతాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో ఉన్న మేధాశక్తిని వెలికితీయాలని సూచించారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా కృత్రిమ మేధ, ఐవోటి లాంటి సాంకేతికతను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. బాలాజీ విద్యాసంస్థలో 100 శాతం ప్లేస్‌మెంట్స్ జరుగడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని కోరారు. అనంతరం పేపర్ ప్రజంటేషన్, బ్రేనియో-బిజినెస్ క్విజ్, మేక్ యువర్ మనీ-బిజినెస్ ప్లాన్లను, డిగ్రీ విద్యార్థులకు జనరల్ క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస, సాంస్కృతిక తదితర కార్యక్రమాలు నిర్వహించారు. డ్యాన్స్, సింగింగ్, ఫ్యాషన్‌షో, టైజర్ హాంట్, మిమిక్రీ, ఫేస్ పేంటింగ్ తదితర కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్ హరిహరన్, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్‌రెడ్డి, బిమ్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంపత్, కన్వీనర్ ప్రసాద్, నరేష్, ఏవో సలేంద్ర సురేష్, మేనేజర్ పెండ్యాల యాదగిరి, విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కనకరాజుకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
- ఆగని పెట్రో మంటలు
- ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభపెడితే రెండేళ్ల జైలు శిక్ష
- రవితేజ 'హల్వా డాన్స్' అదిరింది..వీడియో
- మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి గంగుల
- హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
- భూ తగాదాలతో వ్యక్తి హత్య
- యాదాద్రిలో భక్తుల రద్దీ..
- పాత నోట్లపై కేంద్రం క్లారిటీ..!
- తిరుమలలో త్రివర్ణ పతాకంతో ఊర్వశి రౌటేలా..వీడియో