శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Mar 07, 2020 , 01:57:40

‘పాకాల’కు గోదావరి జలాల ట్రయల్‌ రన్‌

‘పాకాల’కు గోదావరి జలాల ట్రయల్‌ రన్‌

ఖానాపురం, మార్చి 06: దశాబ్ధాలుగా ఎదురుచూస్తున్న పాకాల రైతుల కల నెరవేరబోతున్నది. పాకాల సరస్సులోకి  గోదావరి జలాల అడుగిడనున్నాయి. మండలంలోని పాకాల సరస్సులోకి నల్లబెల్లి మండలంలోని రంగాయ చెరువులోకి గోదావరి జలాలను తీసుకురావడానికి  ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కొన్నేళ్లుగా భగీరథ ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ను ఒప్పించి రామప్ప-పాకాల, రామప్ప-రంగాయచెరువు రెండు ప్రాజెక్టులను రూ.336 కోట్లతో మంజూరు చేయిం చారు. రెండు ప్రాజెక్టులను ఒకదానితో మరొకటి అనుసంధానిస్తూ  డిజైన్‌ చేశారు. ములుగు జిల్లా రామప్ప వద్ద రెండు ప్రాజెక్టులకు సంబంధించి రెండు వేర్వేరు పంప్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే రామప్ప-రంగాయచెరువు ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. కొద్ది నెలల కిందట రామప్ప నుంచి రంగాయ చెరువులోకి ట్రయల్న్‌న్రు విజయవంతంగా పూర్తి చేశారు. రామప్ప -పాకాల ప్రాజెక్టు పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలో  పాకాలలోకి గోదావరి జలాల తరలించడానికి అధికారులు  శుక్రవారం ట్రయల్‌ రన్‌ చేపట్టారు. రామప్ప నుంచి  రం గాయ చెరువు  అక్కడి నుం చి దబీర్‌పేట శివారు వరకు పైప్‌లైన్‌ ద్వారా వచ్చి దబ్బావాగులోకి వచాయి.  అక్కడి నుంచి గ్రావిటి ద్వారా 4 కిలోమీటర్లు ప్ర యాణించి శనివారం ఉదయానికి  పాకాల సరస్సుకు చేరుకోనున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ట్రయల్న్‌న్రు పరిశీలించిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు  

పాకాల సరస్సుకు గోదావరి జలాల ట్రయల్న్‌ పనులను శుక్రవారం ఓడీసీఎంఎస్‌ చూఐర్మన్‌ గుగులోత్‌ రామస్వామినాయక్‌, ఎంపీపీ ప్రకాశ్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఎమ్మెల్యే పెద్ది  కలల ప్రాజెక్టు పాకాల అన్నారు. ఇన్నేళ్లు రాజకీయ పార్టీలు పాకాల రైతులను ఓట్ల కోసం వాడుకున్నారే కానీ ఏనాడు వారి బాగోగులు పట్టించుకోలేదన్నారు. ఈ యాసంగికే గోదావరి జలాలను తీసుకువస్తానన్న ఎమ్మెల్యే  పాకాల రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడన్నారు.  పాకాలకు గోదావరి జలాలను తీసుకొస్తున్న ఎమ్మెల్యే పెద్దికి, సీఎం కేసీఆర్‌లకు ఈ ప్రాంత రైతులమంతా జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో  మాజీ మార్కెట్‌ చైర్మన్‌ బత్తిని శ్రీనివాస్‌గౌడ్‌, వెన్ను సమ్మయ్య, రాజు, హఠ్య తదితరులు పాల్గొన్నారు.logo