గురువారం 04 జూన్ 2020
Warangal-rural - Mar 07, 2020 , 01:54:07

నర్సరీల్లో పూల మొక్కలు అధికంగా పెంచాలి

నర్సరీల్లో పూల మొక్కలు అధికంగా పెంచాలి

సంగెం, మార్చి 06 : గ్రామపంచాయతీ నర్సరీల్లో ఎక్కువగా పూల మొక్కలు అందుబాటులో ఉండే విధంగా పెంచాలని జెడ్పీ సీఈవో రాజారావు అన్నారు. మండలంలోని గుంటూరుపల్లి, గవిచర్ల, ఆశాలపల్లి గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని నర్సరీలు, డంపింగ్‌ యార్డు పనులను పరిశీలించారు. అధికారులకు, ప్రజాప్రతి నిధులకు ఆయన పలు సూచనలు చేశారు.  మొక్కలను పెంచేటప్పుడు జాగ్రత్తగా చూసుకో వాలన్నారు.  పండుగల సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగపడే బంతి, గోరింట పూలను పెంచేందుకు నారు మడులను  ఏర్పాటు చేసి పెంచి వాటిని గ్రామాల్లోని ప్రజలకు ఇచ్చినట్లయితే ప్రయోజనకరంగా ఉంటుందని జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి సీఈవోకు సూచించారు.  గ్రామాల్లో చెత్తసేకరణ చేసి నూతనంగా నిర్మించిన డంపింగ్‌ యార్డుల్లో చెత్త వేసే విధంగాచర్యలు తీసుకో వాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రజాప్రతినిధులు, అధికారులను సీఈవో  ఆదేశిం చారు.   ఆయన వెంట  ఎంపీడీఓ ఎన్‌.మల్లేశం, ఏపీవో లక్ష్మీ, సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీ దొనికెల శ్రీనివాస్‌, టెక్నికల్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు. logo