ఇంటర్ పరీక్షలు ప్రారంభం

నర్సంపేట,నమస్తేతెలంగాణ : ఇంటర్ పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. నర్సంపేటలో ఏడు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా సంస్కృతం, తెలుగు పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ మొదటి సంత్సరం విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం విద్యార్థులు 5443 మంది విద్యార్థులు పరీక్షకు అలాట్మెంట్ చేశారు. వీరిలో 482 మంది విద్యార్థులు గైర్హాజర్ కాగా 4961 మంది పరీక్షలకు హాజరయ్యారు. కేటాయించిన విద్యార్థుల్లో 91 శాతం మంది హాజరయ్యారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలకు అనుమతి లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఉదయం8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షల ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగాయి.
నర్సంపేట రూరల్లో 91 శాతం హాజరు
నర్సంపేట రూరల్ : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్షా కేంద్రాలల్లో విద్యార్థులు మొదటి రోజు వార్షిక పరీక్షలు రాశారు. విద్యార్థులు ఉదయం 9.00గంటల నుంచి మధ్యాహ్నాం 12.00గంటలకు ఈపరీక్షలు రాశారు. ఇంటర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఉదయం 8.30 గంటలకే చేరుకున్నారు. పరీక్షల నిర్వహకులు విద్యార్థులను తనిఖీలు చేసి పరీక్షహాల్లోకి పంపించారు. 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 05 ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు సజావుగా పరీక్షలు రాశారు. మొదటి రోజు ఇంటర్ రెగ్యూలర్ విద్యార్థులు 4587మందికి గాను 4176మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మిగిలిన 411మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఓకేషనల్ విద్యార్థులు 856మందికి గాను 785మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. మిగిలిన 71మంది ఓకేషనల్ విద్యార్థులు పరీక్షలు రాయలేదు. మొత్తం రెగ్యూలర్, ఓకేషనల్ కలిపి 482మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు గైర్హాజరయినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 91శాతం విద్యార్థులు పరీక్షలను సద్వినియోగం చేసుకున్నారు. పలువురు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, ఇన్విజిలేటర్లు పరీక్ష హాల్లో విధులు నిర్వహించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144సెక్షన్ను అమలు చేశారు. పరీక్షా కేంద్రాల ఆవరణలో జిరాక్స్ సెంటర్లు పరీక్ష పూర్తయ్యే వరకు మూసివేశారు. ఆర్టీసీ అధికారులు విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు చేర్చేందుకు ప్రత్యేక బస్సులను నడిపారు. పరీక్షా కేంద్రాల్లో కరెంటు, తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్ తదితర వసతులను ఏర్పాటు చేశారు. మొత్తం మీద మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.
53 మంది గైర్హాజరు..
పరకాల, నమస్తే తెలంగాణ/పరకాల టౌన్ : పరకాల డివిజన్లో మొదటిరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసాయి. బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రారంభమయ్యాయి. తొలిరోజు లాంగ్వేజ్-1 (తెలుగు, సంస్కృతం)తో పరీక్షలు ప్రారంభంకాగా విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్ష రాశారు. ఉదయం 8గంటల వరకే పరీక్షా కేంద్రాలకు చేరుకుని తమకు కేటాయించిన గదుల్లోకి వెళ్లారు. 8.30గంటల వరకు పరీక్షా కేంద్రాలలోకి విద్యార్థులను అనుమతించారు. పరకాల డివిజన్ పరిధిలోని పరకాల, ఆత్మకూరు, గీసుకొండ మండలాల్లో ఇంటర్ పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో ఆత్మకూరు మండలంలో మొదటిసారిగా పరీక్షా కేంద్రం కేటాయించారు. ఆయా మండలాల్లోని పోలీసు స్టేషన్ల నుంచి అధికారులు ప్రశ్నపత్రాలను సెంటర్లకు పోలీసు బందోబస్తు నడుమ తరలించారు.
పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 385మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 46మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా ఎస్వీ జూనియర్ కళాశాలలో 71మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా ఏడుగురు విద్యార్థులు, పరకాల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో 245మంది విద్యార్థులకుగానూ 25మంది విద్యార్థులు హాజరుకాలేదు. గీసుకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 331మందికిగానూ 12మంది, ఆత్మకూరు జూనియర్ కళాశాలలో 271మందికిగానూ 9మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరకాల సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరకాల ఏసీపీ శ్రీనివాస్, సీఐ మహేందర్ తనిఖీ చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందిని ఉంచారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో గుంపులు గుంపులుగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. కాగా నేడు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ వీ శశిధర్, ఎస్వీ జూనియర్ కళాశాలలో చీఫ్ సూపరింటెండెంట్ ఆకుల శోభ పరీక్షలు పర్యవేక్షించారు.
తాజావార్తలు
- నేటి నుంచి తమిళనాడులో రాహుల్ ఎన్నికల ప్రచారం
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు