శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Mar 02, 2020 , 03:26:09

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

పరకాల టౌన్‌, మార్చి 01:  పట్టణాల బాగు కోసమే సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతిని చేపట్టారని పంచాయతీ రాజ్‌ శాఖ, గ్రామీణ అభివృద్ధి  శాఖ మంత్రి  ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పట్ట ణ ప్రగతిలో భాగంగా ఆదివారం కలెక్టర్‌ ఎం,హరిత, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పరకాల పట్టణంలోని  దళిత వాడల్లో పర్యటించారు. అనంతరం  సీఎస్‌ఐ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పల్లె ప్రగతిని చాలెంజ్‌గా తీసుకుని గ్రామాలను అభివృద్ధి  చేశామని, అదే స్ఫూర్తితో పట్టణ ప్రగతిని చేపట్టామన్నారు. పట్టణ ప్రగతిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పోటీ పడి వార్డుల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా మున్సిపాలిటీల అభివృద్ధికి  నిధులు విడుదల చేస్తుందన్నారు. పరకాల మున్సిపాలిటీకి ప్రతి నెల రూ.22లక్షల నిధులు మంజూరు అవుతాయని, దీంతో ప్రతి వార్డుకు రూ. లక్షతో  అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఈ విధులతో పాటు అభివృద్ధికి  అనుగుణంగా మున్సిపాలిటీ ఆదాయాన్ని పెంచుకోవాలన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపల్‌ చట్టాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో 75గజాల్లోపు ఇళ్ల నిర్మించుకునేందుకు అనుమతి అవసరం లేదని, ఆపైన స్థలంలో ఇంటిని నిర్మించుకుంటే 21రోజుల్లో అనుమతి ఇవ్వాలన్నారు.  

ప్రత్యేక విజన్‌తో ముందుకు..

సీఎం కేసీఆర్‌ ప్రత్యేక విజన్‌తో ముందుకెళ్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సాహసోపేత నిర్ణయాలతో అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. పట్టణ ప్రగతిలో భాగం గా వార్డుల్లో పేరుకుపోయిన మురుగును  తొలగించడం, పారిశుధ్య  నిర్వహణ, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. ఏడు రోజులు స్పెషల్‌ ఆఫీసర్లు, కౌన్సిలర్లు, ప్రజలు స మష్టిగా పని చేయడంతో వార్డుల స్వరూపమే మారిందన్నారు. 

క్లీన్‌ పరకాలగా మార్చాలి..

పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, ప్రజలు సమన్వయంతో పని చేసి క్లీన్‌ పరకాలగా మార్చాలని  కలెక్టర్‌ ఎం. హరిత అన్నారు. ప్రట్టణ ప్రగతిలో ప్రజల వద్దకే అధికారులు వస్తున్నారని, దీంతో క్షేత్ర స్థాయిలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరమయ్యే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రగతిలో భా గంగా పారిశుధ్యం, విద్యుత్‌ సమస్యలు వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు.   కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ మహేందర్‌ రెడ్డి, ఆర్డీ వో కిషన్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సోద అనిత, వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌ రెడ్డి, కౌన్సిలర్లు సంపత్‌కుమార్‌, సారయ్య, స్రవంతి, మొగిళి, జ్యోతి, రాము, మల్లేశం, లావణ్య, బండి రాణి, రజినీ, ఉమ దేవి, సుజాత, రమాదేవి, గోపి, రాజు,  జయమ్మ,  జయంత్‌లాల్‌, భద్రయ్య, మున్సిపల్‌ కమిషనర్లు బి.యాదగిరి, లక్కర్సు రాజు, తహసీల్దార్‌ జగదీశ్వర్‌, స్పెషల్‌ ఆఫీసర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.