‘ప్రగతి’తోనే రాష్ట్ర అభివృద్ధి

వర్ధన్నపేట, నమస్తే తెలంగాణ, మార్చి 01 : పల్లెలతో పాటు పట్టణాలు కూడా సమగ్రంగా ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం వర్ధన్నపేట పట్టణంలోని పలు వార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా 12వ వార్డులో ఏర్పాటు చేసిన సమావేశంలో చెత్తబుట్టల పంపిణీ, మున్సిపల్ కార్యాలయం ఆవరణలో చెత్తసేకరణకు కొనుగోలు చేసిన రెండు ట్రాలీ ఆటోలను ప్రారంభించిన అనంతరం ఆర్అండ్బీ అతిథిగృహం ఆవరణలో సులభ్కాంప్టెక్స్ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో సమగ్ర సమాచారం సేకరిస్తున్నామన్నారు. పట్టణ ప్రగతిలో అధికారులు, కౌన్సిలర్లు ప్రజల సమస్యలను గుర్తిస్తారన్నారు. ఈ సమస్యలను కలెక్టర్ ఆధ్వర్యంలో ఆన్లైన్లో నమోదు చేసి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదిక ద్వారా అందిస్తామన్నారు. దీంతో ప్రభుత్వం సమస్యల ప్రాధాన్యతను గుర్తిస్తూ వరుస పద్ధతిలో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు నిధులను మంజూరు చేస్తుందన్నారు. ప్రతి ఇంటికి రెండు చెత్తబుట్టలను అందించామన్నారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య కార్మికులకు అప్పగించాలన్నారు. అలాగే ప్రభు త్వం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్ర ణాళికలు రూపొందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో పట్టణంలో 80వేల మొక్కలను నాటడంతో పాటు 85 శాతం సంరక్షించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం 12వ వార్డు కౌన్సిలర్ పూజారి సుజాత, రఘు దంపతులు, 7వ వార్డు కౌన్సిలర్ పాలకుర్తి సు జా త, మాజీ జెడ్పీటీసీ పాలకుర్తి సారంగపాణి దంపతులు ఎమ్మెల్యే రమేశ్, డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మార్నేని రవీందర్రావును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్రెడ్డి, కమిషనర్ గొడిశాల రవీందర్, ఆయా వార్డుల కౌన్సిర్లు, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అడవి పందిని చంపిన వేటగాళ్ల అరెస్ట్
- సవరణలకు ఓకే అంటేనే మళ్లీ చర్చలు: తోమర్
- అఖిలప్రియకు బెయిల్ మంజూరు
- ఎంపీ అర్వింద్..రాజీనామా చేశాకే రైతులతో మాట్లాడు
- అగ్నిప్రమాదంలో వెయ్యి కోట్లకుపైగా నష్టం: సీరమ్ సీఈవో
- సలార్ లో హీరోయిన్ గా కొత్తమ్మాయి..!
- భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
- ఇద్దరు పిల్లలతో తల్లి అదృశ్యం?
- ఈ ‘పాటలు’ మీకు గుర్తున్నాయా ?
- ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు