డీసీసీబీపై గులాబీ జెండా

సుబేదారి, 29: ఉమ్మడి వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుపై గులాబీ జెండా రెపరెపలాడింది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్బావం అనంతరం తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి డీసీసీబీని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల్లో ఏకపక్షంగా అత్యధిక చైర్మన్ స్థానాలను కైవసం చేసుకుంది. అనంతరం డీసీసీబీ డైరెక్టర్ పదవుల ఎన్నికల్లో గులాబీ పార్టీ హవా కొనసాగింది. ఈ నేపథ్యంలో నూతన పాలకమండలి చైర్మన్‌గా మార్నేని రవీందర్రావు, వైస్‌చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హన్మకొండ అదాలత్ డీసీసీబీ కార్యాయంలో పాలకమండలి చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారి మద్దిలేటి ఉదయం 9 నుంచి 11 గంటల సమయంలో చైర్మన్ ,వైస్‌చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. చైర్మన్ అభ్యర్థిగా మార్నేని రవీందర్రావు, వైస్‌చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి నామినేషన్దాఖలుచేశారు. రెండు పదవులకు సింగిల్ నామినేషన్లు రావడంతో ఎన్నికల అధికారి నామినేషన్‌పత్రాలను పరిశీలించి వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించి, ధృవీకరణ పత్రాలను అందజేశారు.
ఈ నెల డీసీసీబీ నూతన కమిటీ డైరెక్టర్ల ఎన్నిక జరిగిన తెలిసిందే. కేటగిరి ఏ-లో 16 డైరెక్టర్పోస్టులకు 14 మంది సింగిల్ నామినేషన్లతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా రెండు డైరెక్టర్లు పదవులు ఎస్సీ రిజర్వ్ స్థానాలు కావడంతో అభ్యర్థులు లేక ఖాళీగా ఉన్నాయి. కేటగిరి బీ- లో నాలుగు డైరెక్టర్ పోస్టులు ఉండగా, మూడు పోస్టులకు ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఎస్టీ రిజర్వు పోస్టుకు అభ్యర్థి లేకపోవడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. కేటగిరి -ఏ, కేటగిరి -బీ కలిపి మొత్తం 20 డైరెక్టర్ పదవులకు 17 మంది ఎన్నికైన విషయం విదితమే. ఇక చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నికకు సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారి చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ ఎన్నికకు పోటీ అనేది లేకుండా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్ టీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చలు జరపడంతో ఏకగ్రీవమైంది. డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్రావు, వైస్ చైర్మన్‌గా వెంటేశ్వర్‌రెడ్డి 15 మంది డైరెక్టర్లతో కలిసి డీసీసీబీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తాజావార్తలు
- ఐటీ అభివృద్ధికి బ్లూప్రింట్
- క్షిపణి సాంకేతికతలో ఆత్మ నిర్భరత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అవార్డుతెచ్చిన ‘అమ్మమ్మ’ ఆవిష్కరణ
- 20.41 కోట్లతో దివ్యాంగులకు ఉపకరణాలు
- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల ఆదేశం
- ప్లాస్మా పొడితో ప్రతిరక్షకాలు
- 20 వేల ప్రైవేట్ వైద్యసిబ్బందికి టీకా
- ఏపీ ‘పంచాయతీ’కి సుప్రీం ఓకే
- సత్యలోకం కోసం బలి!
- 8 ఎకరాల్లో పీవీ విజ్ఞానవేదిక