కాళేశ్వరంతో సస్యశ్యామలం

sకాళేశ్వరంతో
సస్యశ్యామలం
శాయంపేట, ఫిబ్రవరి 27 : అసాధ్యాలను సుసాధ్యం చేసి కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు తెప్పించిన మహానేత సీఎం కేసీఆర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శాయంపేట పీఏసీఎస్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సం గురువారం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రమణారెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి హాజరయ్యారు. వీరి సమక్షంలో పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్‌బాబు, వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి, డైరెక్టర్లతో సీఈవో రాజమోహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ చలివాగు ప్రాజెక్టు ఆయకట్టులో మంచి పంటలు పండించే రైతులున్నారన్నారు. రైతులకు సేవచేయాల్సిన బాధ్యత పీఏసీఎస్‌పై ఉందని చెప్పారు. శరత్‌బాబు రైతుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటాడని చైర్మన్‌గా గురుతర బాధ్యత పెట్టామన్నారు. చలివాగు ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఈ మండలం రైతుల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వివరించారు. తెలంగాణ కోసం ఎవరు పిలుపునిచ్చినా కలిసికట్టుగా పోరాటం చేశారన్నారు. కేంద్రం అనివార్యంగా గుర్తించి తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ వస్తే కరెంటు ఎట్లా, ఎలా బతుకుతారని ముసలికన్నీరు కార్చారన్నారు. ఐదేండ్లల్లోనె తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని వివరించారు. ఇందు కోసం సీఎం కేసీఆర్ నిర్విరామంగా కృషి చేశారన్నారు. గతంలో వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ ఇచ్చారని, కానీ ఈరోజు ఉచితంగా ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కాళేశ్వరంను మూడేళ్ల కాలంలో నిర్మించడం మానవులు చేసే పని కాదని భగవంతుడి సలకల్పంగా భావిస్తున్నానని చెప్పారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌దని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎస్సారెస్పీ కాల్వల్లో 30 ఏండ్లుగా నీళ్లు రాలేదని, చిట్యాల, టేకుమట్ల వరకు నీళ్లు పోలేదని అన్నారు. కానీ, నేడు అన్ని చెరువుల్లోకి కాళేళ్వరం నీళ్లు వస్తున్నాయని తెలిపారు. కేసీఆర్‌కు వ్యవసాయ రంగంపై అధిక ప్రేమ ఉండటమే దీనికి నిదర్శనమన్నారు.కల్యాణలక్ష్మి కింద పేదింటి ఆడపిల్లకు సీఎం కేసీఆర్ మేనమామలాగా, తండ్రిలాగా ముందుండి లక్ష116 అందిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. ఏప్రిల్ నుంచి కొత్త పింఛన్లు అర్హలందరికీ అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాందారిపేట నుంచి డబుల్ రోడ్డుకు త్వరలోనిధులు మంజూరవుతాయని, టెండర్లు పిలిచి పనులు చేపడుతామన్నారు. ఆత్మకూరు నుంచి శాయంపేట వరకు డబుల్ రోడ్డు విస్తరణలో ఇండ్లు పోతున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గండ్ర హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు టీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. చలివాగు దేవాదుల పంపుహౌస్‌లో నీటి మట్టం తగ్గకుండా చూడాలని, ఏ స్థాయిలో ఉన్నామని చూడకుండా రైతుల పక్షాన ఉంటామని స్పష్టం చేశారు.
రైతుల మన్ననలు పొందాలి : జెడ్పీ చైర్పర్సన్
శాయంపేట పీఏసీఎస్ పాలకవర్గం రైతులకు సేవలు అందించి అందరి మన్ననలు పొందాలని జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందన్నారు. ఇక నాలుగేళ్ల వరకు ఎన్నికలు లేవని, రాబోయే రోజుల్లో అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వంలో అభివృద్ధి పనులు జరిపించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణను గుర్తింపు ప్రాంతంగా చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు.
కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
పీఏసీఎస్ ప్రమాణ స్వీకారోత్సవ వేదికపై నుంచి కల్యాణలక్ష్మి, షాదిముబారక్ లబ్ధిదారులకు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి చెక్కులను అందజేశారు. మొత్తం రూ.31లక్షల విలువైన 32 చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ.2.05లక్షల విలువైన 8 చెక్కులను గండ్ర దంపతులు లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమానికి చైర్మన్ కుసుమ శరత్‌బాబు అధ్యక్షత వహించగా ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి, ఎంపీడీవో సుమనవాణి, రైతు సమితి కన్వీనర్ కర్ర ఆదిరెడ్డి, సర్పంచ్ రవి, సీఈవో రాజమోహన్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగుల మనోహర్‌రెడ్డి, ఏవో జమున, ఎంపీటీసీలు స్వాతి, వేణు, సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార
- నల్లటి వలయాలను తగ్గించేందుకు ఇవి తింటే చాలు
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
- ఆస్కార్ రేస్‌లో విద్యాబాలన్ సినిమా నట్‌ఖట్
- శాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఆల్ట్రా 5G బుకింగ్స్ ప్రారంభం
- సింగపూర్‌లో ఘనంగా సంక్రాంతి సంబురాలు