ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - Feb 28, 2020 , 02:49:36

పేదింట కల్యాణ కాంతులు

పేదింట కల్యాణ కాంతులు

పేదింట కల్యాణ కాంతులునర్సంపేట, నమస్తే తెలంగాణ : పేదింటి యువతుల వివాహాలకు తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందించారు. నర్సంపేట నియోజకవర్గంలో 59 మంది లబ్ధిదారులకు రూ.57.57 లక్షలు, 25 మందికి రూ.7 లక్షల విలువగల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు  అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ పేదింటి పెళ్లిళ్లకు ప్రభుత్వం నిధులను అందిస్తున్నదని తెలిపారు.ఒక్కొక్కరికి రూ. లక్షా నూటపదహార్లు అందిస్తున్నదని అన్నారు. పూర్తిగా సామాజిక స్పృహతో తీసుకొచ్చిన ఈ పథకం గొప్పదని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకం  పేదల కుటుంబాల్లో భరోసా కల్పిస్తున్నదని వివరించారు. ఈ పథకం ఉద్యమ కాలంలో కేసీఆర్‌ మదిలో పుట్టిందని అన్నారు. ములుగు మండలం రామచంద్రాపురంలో పత్తి రైతు ఇల్లు కాలిపోయి కుమార్తె వివాహం కోసం డబ్బులు కాలిపోయాయి, ఆ కుటుంబం యాతన పడుతున్న సందర్భంలో కేసీఆర్‌ ఆదుకున్నారని తెలిపారు. ఆనాటి నుంచే పేదింటికి యువతుల వివాహాలకు సాయం చేస్తున్నారని తెలిపారు.  అధికారంలోకి రాగానే ఈ ప్రకటనను చేసి అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి వారం ఈ పథకంలో లబ్ధిదారులకు సాయం అందిస్తున్నారని అన్నారు. చెక్కులను కూడా యువతి తల్లి పేరు మీద ఇస్తున్నారని అన్నారు. అయితే వివాహం జరుగకముందే లగ్నపత్రిక రాయించుకుని దరఖాస్తు చేస్తే, పెండ్లి సమయంలో చెక్కులు అందిస్తామని అన్నారు. నర్సంపేట నియోజకవర్గంలో పెండింగ్‌ లేకుండా కల్యాణలక్ష్మి చెక్కులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పెద్ది వివరించారు. రెవెన్యూ అధికారుల పరిశీలన అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందిస్తున్నట్లు వివరించారు. అనారోగ్యంతో బాధ పడుతున్న రోగులు కూడా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు చేసుకుంటే వారికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను కూడా అందిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చేరి ముందుస్తుగా ఆయా ఆస్పత్రుల నుంచి ఎస్టిమేట్‌ను తీసుకుని సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఎల్‌ఓసీలు అందిస్తున్నామని అన్నారు. అంతేకాకుండా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో డబ్బులు వైద్య చికిత్స కోసం ఖర్చు చేసినా, వాటిని తిరిగి ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఐదు మండలాల తహసీల్దార్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, కార్మికులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అన్ని గ్రామాలు అభివృద్ధిలో పోటీ పడాలి 

నర్సంపేట రూరల్‌ : అన్ని గ్రామాలు అభివృద్ధిలో పోటీలు పడాలని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని మాధన్నపేట గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌ను గురువారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. తొలుత జీపీ ట్రాక్టర్‌ ముందు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ డివిజన్‌లోని అన్ని గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా తయారు కావాలన్నారు. గ్రామాల్లోని ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాల పరిశుభ్రతను విధిగా పాటించాలన్నారు. గ్రామ ప్రజల అవసరాలకు కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ను ఉపయోగించాలని సూచించారు. గ్రామాల్లోని ప్రజలు తడి, పొడి చెత్తను వేరుచేసి గ్రామ పంచాయితీ ట్రాక్టర్‌లో వేయాలని కోరారు. సర్పంచ్‌ మొలుగూరి చంద్రమౌళి, ఎంపీటీసీ ఊడ్గుల రాంబాబు, ఉప సర్పంచ్‌ మారపాక రమాదేవి, పీఏసీఎస్‌ డైరెక్టర్‌ పెసరు సాంబరాజ్యం, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కో-ఆర్డినేటర్‌ కడారి కుమారస్వామి, ఆర్‌ఎస్‌ఎస్‌ కన్వీనర్‌ బొల్లోని సాంబయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు. logo