శనివారం 16 జనవరి 2021
Warangal-rural - Feb 27, 2020 , 02:52:14

పల్లె ప్రగతి పనులు పూర్తిచేయాలి

పల్లె ప్రగతి పనులు పూర్తిచేయాలి

కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26 : గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ శాఖకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సూచించారు. బుధవారం సాయంత్రం  పల్లెప్రగ తి పనులపై హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో ఆ యన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ట్రాక్టర్ల కొనుగోలు, నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు చేపట్టాలన్నారు. పంచాయతీలు కరెంట్‌ బిల్లులను పెండింగ్‌ లేకుండా చెల్లించాలన్నారు. ఈ మేరకు కలెక్టర్‌  చొరవ చూపాలన్నారు. నర్సరీలో మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. వేసవిలో షెడ్‌ నెట్‌ ఏర్పాటు చేసి, మండలాధికారులు రోజూ పర్యవేక్షించాలన్నారు. జీపీల్లో చెత్తసేకరణ క్రమం తప్పకుం డా చేయాలన్నారు. పట్టణ ప్రగతిపై మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మాట్లాడుతూ వార్డుల్లో చేపట్టిన పనులు రోజు వారీగా వెబ్‌సైట్‌లో నమో దు చేయాలన్నారు. వార్డుల్లో నిరక్షరాస్యత సర్వేలో అవసరమైతే మహిళా సంఘాల  సహా యం తీసుకోవాలన్నారు. కమ్యూనిటీ టాయిలెట్లలో మహిళలకు మూడు, పురుషులకు రెం డు టాయిలెట్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మార్చి 15 లోగా బడ్జెట్‌ కసరత్తు పూర్తి చేసి నివేదిక అందజేయాలని సూచించారు. బడ్జెట్‌లో మూడోవంతు  విలీనగ్రామాలకు, పది శాతం హరితహారానికి కేటాయించాలన్నారు. కలెక్టర్‌ హరిత మాట్లాడుతూ నర్సరీ పనులు చురుగ్గా సాగుతున్నాయని, విత్తన కొనుగోలు, బ్యాగ్‌ ఫిల్లింగ్‌ పనులు పూర్తయ్యాయన్నారు. వెహికిల్‌ కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తికావొస్తుందని వివరించారు. కార్యక్రమంలో అడిషినల్‌ కలెక్టర్‌, డీపీవో, ఆర్‌డీవో, జెడ్పీ సీఈవో పాల్గొన్నారు.