గురువారం 04 జూన్ 2020
Warangal-rural - Feb 26, 2020 , 03:08:29

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

పరిసరాల పరిశుభ్రతను పాటించాలి

నర్సంపేట,నమస్తేతెలంగాణ : వార్డుల్లో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటిరజినీకిషన్‌ అన్నారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రెండో రోజు 21వ వార్డులో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ  కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. వ్యాధులను దూరం చేయాలంటే తప్పనిసరిగా చెత్తను దూరం చేయాలని తెలిపారు.  ఇంట్లోనుంచి వచ్చే చెత్తను ప్రతి రోజూ తడిపొడి చెత్త బుట్టలలో నిల్వ చేయాలని సూచించారు. ఈ చెత్తను మున్సిపాలిటీ కార్మికులకు  ఇవ్వాలని కోరారు.  మురుగుకాల్వలో చెత్త వేయడం వల్ల నీరు ముందుకు వెళ్లకుండా నిల్వ అవుతుందని తెలిపారు.   ప్లాస్టిక్‌ వ్యర్థాలను కూడా ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని అన్నారు. ప్లాస్టిక్‌ రహిత పట్టణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. నర్సంపేట పట్టణంలోని నిర్వహిస్తున్న పట్టణ ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలన్నారు.  మున్సిపల్‌ పరిధిలో అన్ని వార్డులకు మిషన్‌భగీరథ నీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సహకారంతో పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ గంపసునీత, నాగిశెట్టి పద్మ, పాషా, స్పెషల్‌ అధికారి దయాకర్‌, భారతి, గట్ల వాసు,  సదానందం, రబ్బాని,గట్లు కార్తీక్‌  పాల్గొన్నారు.

  పిచ్చి  మొక్కలు తొలగించాలి

నర్సంపేట టౌన్‌ :  ఖాళీ ప్రదేశాల్లో పిచ్చి మొక్కలను తొలగించాలని స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రసాదరావు అన్నారు. మంగళవారం నర్సంపేటలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి పనులను ఆయన పరిశీలించారు.  15 వ వార్డులో  పట్టణ ప్రగతి పనులు విస్తృతంగా నిర్వహించారు. ఖాళీ ప్రా ంతాల్లో పిచ్చిమొక్కలు, తుమ్మ చెట్లను  ప్రొక్లయినర్‌ సహాయంతో తొలగించే పనులను ఆయన  పరిశీలించారు. పట్టణ ప్రగతిలో అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు.  అనంతరం పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన పనులను వివరించారు.   ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా పట్టణ ప్రగతి  నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు.  పట్టణ ప్రగతిలో ప్రజల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.  ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రుద్ర మల్లీశ్వరీ, విజయకుమార్‌,మినుముల రాజు,జుర్రు రాజు   పాల్గొన్నారు.


logo