ఆదివారం 07 జూన్ 2020
Warangal-rural - Feb 26, 2020 , 02:06:33

పట్టణ ప్రగతి లక్ష్యాలను సాధించాలి

పట్టణ ప్రగతి లక్ష్యాలను సాధించాలి

పరకాల టౌన్‌, ఫిబ్రవరి 25:  పట్టణ ప్రగతి లక్ష్యాలను సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆర్డీవో, పట్టణ స్పెషలాఫీసర్‌ ఎల్‌ కిషన్‌ అన్నారు. మంగళవారం పరకాల పట్టణంలోని పలు వార్డుల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయిలో చేపట్టి వార్డులను అభివృద్ధి పథంలో దూసుకెళ్లేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి  వార్డులో నెలకొన్న సమస్యలను ముందుగా గుర్తించి, సమస్యలను ప్రణాళిక బద్ధంగా పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. వార్డు కౌన్సిలర్‌, వార్డు స్పెషల్‌ ఆఫీసర్‌ సమన్వయంతో పని చేసి పట్టణ ప్రగతిని ముందుకు తీసుకుపోవాలని అన్నారు. ప్రతి వార్డులో వార్డు కమిటీ సభ్యులను, ప్రజలను భాగస్వామ్యం చేసే విధంగా సంబంధిత కౌన్సిలర్‌ అవగాహన కల్పించాలన్నారు. వార్డు పరిధిలో ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, సైడ్‌ ్రడ్రైన్‌ల నిర్వహణ, విద్యుత్‌ సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు. వార్డుల్లో సంభందిత స్పెషల్‌ ఆఫీసర్‌లు అన్ని పనులను విధిగా చేపట్టి ప్రభుత్వ లక్ష్యం నెరవేరే విధంగా ప్రణాళికలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చైర్‌ పర్సన్‌ సోద అనిత రామకృష్ణ, వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్‌ కమిషనర్లు బీయాదగిరి, ఎల్‌ రాజు, స్పెషల్‌ ఆఫీసర్లు, మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

 అందరూ భాగస్వాములు కావాలిమున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనిత

పట్టణంలోని 20వ వార్డులో మున్సిపాలిటీ చైర్‌ పర్సన్‌ సోద అనిత రామకృష్ణ, 11 వార్డులో వైస్‌ చైర్మన్‌ రేగూరి విజయపాల్‌ రెడ్డి, 16 వ వార్డులో బండి రమ వార్డుల పరిధిలోని పలు కాలనీలల్లో  పారిశుధ్య పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ సోద అనిత రామకృష్ణ మాట్లాడుతూ.. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలు అభివృద్ధ్ది పథంలో దూసుకుపోతాయన్నారు.  పట్టణ ప్రగతిలో వార్డు కమిటీ సభ్యులే కా కుండా ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలని కోరారు.   పట్టణ ప్రగతి  రెండవ రోజైన  పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డుల్లో కౌన్సిలర్లు, అధికారులు క్షేత్ర స్థాయిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా  సమస్యలను గుర్తించారు.  వాటిని పరిష్కరించేందుకు  చర్యలను తీసుకున్నారు.  పట్టణ ప్రగతి పనులను ఆర్డీవో, స్పెషల్‌ ఆఫీసర్‌ కిషన్‌ పర్యవేక్షించారు.


logo