అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు

- నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
- పల్లెప్రగతి నిధులతోపాటు అదనంగా నియోజకవర్గానికి రూ.12కోట్లు మంజూరు
- మార్చి రెండోవారంలోగా తగిన ప్రణాళికలతో పనులు పూర్తిచేయాలి
- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
- పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష
- సంగెం మండల కేంద్రంలోని హాస్టళ్ల తనిఖీ, కలెక్టర్ హరితతో కలిసి సౌకర్యాలపై ఆరా
పరకాల, నమస్తే తెలంగాణ : పరకాల నియోజకవర్గంలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హెచ్చరించారు. హన్మకొండలోని ఎమ్మెల్యే నివాసంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులతో అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే చల్లా శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం రూ.12కోట్లు మంజూరయ్యాయని అన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మంజూరైన నిధులతోపాటు అదనంగా ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని, ఈ నిధులను మార్చి రెండోవారంలోగా పనులు పూర్తిచేయాలని చెప్పారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారని, అందుకనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నిలిపేందుకు పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను ప్రభుత్వం కఠినం చేసిందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమం అమలు, అభివృద్ధి పనులకు సహకరించకపోయినా ఆ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్, వీఆర్వోలపై ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వారిని విధుల నుంచి తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి అభివృద్ధి పనిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. మారిన చట్టాలపై అవగాహన పెంచుకుని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిన జీపీలకు అదనంగా రూ.10లక్షల నిధులు మంజూరు చేస్తామని ధర్మారెడ్డి చెప్పారు. సమావేశంలో పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర, గీసుకొండ, సంగెం మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పంచాయతీరాజ్ శాఖ ఎస్ఈ సంపత్‌కుమార్, డీఈ లింగారెడ్డి, ఏఈలు కిష్టయ్య, సుధాకర్, రాజేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
సంగెంలో హాస్టళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్
సంగెం : సంగెం మండల కేంద్రంలోని పోస్ట్‌మెట్రిక్ హాస్టల్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రీమెట్రిక్ హాస్టళ్లను శనివారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. గత ఏడాది రూ. 1.70 కోట్లతో నిర్మించిన గిరిజన బాలుర పోస్ట్‌మెట్రిక్ వసతి గృహంలో గదులు, విద్యార్థుల వసతులను ఎమ్మెల్యే, కలెక్టర్ పరిశీలించారు. అలాగే మండల కేంద్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టలోకి వెళ్లి విద్యార్థుల సంఖ్య, వసతులపై ఆరా తీశారు. గత ఏడాది సంగెం మండలానికి ప్రభుత్వం జ్యోతిరావుపూలే బాలురు గురుకుల పాఠశాలను మంజూరు చేసింది. దీంతో మండల కేంద్రంలో సరిగా సదుపాయాలు లేవనే ఉద్దేశంతో ఆ పాఠశాలను పరకాలకు తరలించారు.
అక్కడ గురుకుల పాఠశాల ప్రైవేట్ భవనంలో కొసాగుతుంది. దీంతో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రస్తుతం పరకాలలో నడుస్తున్న గురుకులాన్ని సంగెం మండల కేంద్రానికి తరలించేందుకు ఎమ్మెల్యే, కలెక్టర్ హరిత హాస్టళ్లను సందర్శించారు. మండల కేంద్రంలో ఉన్న నూతనంగా నిర్మించిన గిరిజన పోస్ట్‌మెట్రిక్ హాస్టల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఎమ్మెల్యే, కలెక్టర్ విద్యార్థులకు కావాల్సిన వసతులపై మాట్లాడారు. వచ్చే విద్యాసంవత్సరానికి సంగెంలోనే గురుకుల పాఠశాల నడువనున్నట్లు తెలిపారు. సంగెంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను తహసీల్దార్ సుహాసినిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కందకట్ల కళావతి, జెడ్పీటీసీ గూడ సుదర్శన్‌రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా నాయకులు నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కందకట్ల నరహరి, ఎంపీడీవో ఎన్ మల్లేశం, తహసీల్దార్ వీ సుహాసిని,ఆర్సీవో లక్ష్మీనారాయణ, రూరల్ జిల్లా కన్వీనర్ మనోహర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్ గుండేటి బాబు, మాజీ ఎంపీపీ వీరాచారి, అప్పె నాగార్జునశర్మ, సదయ్య, హాస్టల్ వార్డెన్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హెచ్1-బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు గుడ్‌న్యూస్
- ఆ ఆరోపణలు క్రేజీగా ఉన్నాయి: బిల్ గేట్స్
- ప్రియురాలితో గొడవపడి సముద్రంలో దూకిన యువకుడు
- పల్లె ప్రకృతివనం, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ప్రారంభించిన మంత్రి
- యాదాద్రి పనుల తీరుపై మంత్రి అసంతృప్తి.. అధికారులపై ఆగ్రహం
- గంగూలీకి మళ్లీ ఛాతీలో నొప్పి
- కర్ణాటక సరిహద్దు వివాదంపై మహారాష్ట్ర బుక్ రిలీజ్
- ముష్కరుల దాడి.. నలుగురు జవాన్లకు గాయాలు
- ఐపీఎల్-2021 మినీ వేలం తేదీ, వేదిక ఖరారు
- థాంక్యూ ఇండియా : నేపాల్ ప్రధాని ఓలీ