ఆపన్నహస్తం కోసం యువకుడి ఎదురు చూపు

కేసముద్రంటౌన్ , ఫిబ్రవరి21: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రానికి చెందిన సామాజికవేత్త చాగంటి కిషన్ కుమారుడు చైతన్య రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన కిషన్-ఉమ దంపతుల కుమారుడు చైతన్య క్రికెట్ క్రీడాకారుడు. ఈ నెల 19న చైతన్య హన్మకొండ నుంచి ద్విచక్ర వాహనంపై అన్నారానికి వెళ్తుండగా వరంగల్ రూరల్ జిల్లా కొంకపాక జీపీ పరిధి ఎస్సారెస్పీ కాల్వ వద్ద ఎదురుగా వస్తున్న వాహనం(జీపు) ఢీకొట్టింది. ఈ ఘటనలో చైతన్య తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ములుగు క్రాస్ రోడ్డులోని అజర దవాఖానకు తరలించారు.
దాతలు ఆదుకోవాలి
నిరుపేద కుటుంబానికి చెందిన చాగంటి కిషన్ నిస్వార్థంగా పని చేసే వ్యక్తి. మార్కెట్లో రైతులకు, కార్మికులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే వెళ్లి అధికారులతో మాట్లాడి పరిష్కరించే తత్వం గల మనిషి. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసేవాడు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర కోసం జరిగిన ఉద్యమంలోనూ క్రియాశీలకంగా పాల్గొన్నాడు. ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆపదలో ఉండగా, ఖరీదైన చికిత్స చేయడానికి ఆర్థిక స్థోమత లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. చైతన్య స్నేహితులు దవాఖాన వద్దకు వెళ్లి తన స్నేహితుడి పరిస్థితి గమనించి వాట్సప్, ఫేస్‌బుక్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. వైద్యం చేయడానికి రూ.5లక్షల వరకు అవసరం ఉంటుందని వైద్యులు చెబుతుండగా ఇప్పటి వరకు ఫోన్ పే, గూగుల్‌పే ద్వారా కొంతమేర డబ్బు విరాళం వచ్చినట్లు కిషన్ చెప్పారు. ఆపదలో ఉన్న తన కుమారుడు చైతన్య వైద్య ఖర్చులకు దాతలు ఆంధ్రాబ్యాంక్ ఖాతా నంబర్ 064210100225961 ఐఎఫ్ఎస్సీ కోడ్ ఏఎన్‌డీబీ 0000642కి విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని చాగంటి కిషన్ వేడుకుంటున్నాడు.
తాజావార్తలు
- బిగ్‌బీ వీడియోపై గీతా గోపీనాథ్ స్పందన
- బెల్లో టెక్నీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ పోస్టులు
- అందరికీ సమాన అవకాశాలు : మంత్రి కేటీఆర్
- గుడ్ న్యూస్ చెప్పిన అరియానా.. !
- ఆలయాలపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం ఏంచేస్తోంది : పవన్ కల్యాణ్
- 15 రోజుల్లో పీవీ విజ్ఞాన వేదిక పనులు ప్రారంభం
- మేలో కాంగ్రెస్ ప్లీనరీ.. అప్పుడే కొత్త అధ్యక్షుడి ఎన్నిక
- బెంగాల్ మంత్రి రాజీవ్ బెనర్జి రాజీనామా
- మా సెర్చ్ ఇంజిన్‌ను ఆపేస్తాం.. గూగుల్ హెచ్చరిక
- డార్క్ వెబ్‌లో కీలక డేటా