ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలి

నర్సంపేట,నమస్తేతెలంగాణ: గ్రామాల్లో ప్రభుత్వం అందించిన ట్రాక్టర్లను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. శుక్రవారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నర్సంపేట మండలం చంద్రయ్యపల్లె గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని చెత్తను డంపింగ్ యార్డులకు తరలించేందుకు ఈ ట్రాక్టర్లను ఉపయోగించుకోవాలని కోరారు. గ్రామంలో గత హరితాహారంలో నాటిన మొక్కలను ఎండిపోనియకుండా కాపాడాలని అన్నారు. ట్రాక్టర్ల ద్వారా ట్యాంకర్లను ఏర్పాటు చేసుకుని నీటిని అందించేందుకు కృషి చేయాలని కోరారు. స్వచ్ఛ గ్రామాలుగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు తిరుపతిరెడ్డి, సర్పంచ్ రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శగ్రామాలుగా తయారుచేయాలి
నర్సంపేట రూరల్ : డివిజన్లోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తయారు చేయాలని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామానికి ప్రభుత్వం అందించిన నూతన జీపీ ట్రాక్టర్‌ను తొలుత ఎంపీపీ మోతె కళావతి, జెడ్పీటీసీ కోమాండ్ల జయ, ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ బరిగెల లావణ్య ప్రారంభించారు. అనంతరం అదే ట్రాక్టర్‌ను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కూడా ప్రారంభించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ భాషబోయిన శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పెద్ది తిరుపతిరెడ్డి, కోమాండ్ల గోపాల్‌రెడ్డి, మోతె పద్మనాభరెడ్డి, బరిగెల కిషోర్, జమున, శ్యామల, శ్రీనివాస్, రాజు, సోనీ, ఐలమ్మ, సాంబయ్య, రజిత, వస్రాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని ముగ్ధుంపురం గ్రామ శివారు హెచ్‌పీ వినాయక ఫిల్లింగ్ స్టేషన్లో బంపర్ డ్రా విజేతలకు ఎమ్మెల్యే పెద్ది ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంధన వినియోగదారులను ప్రోత్సహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేల్స్ మేనేజర్ మానెల్లి సుందర్రావు, గుడిపూడి నాగేశ్వర్రావు, పవన్‌కుమార్, శ్రీను, రవీందర్, అనూష, కవిత, మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు
తాజావార్తలు
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
- మమతా బెనర్జీ ఇస్లామిక్ ఉగ్రవాది: యూపీ మంత్రి
- బస్సును ఢీకొన్న లారీ.. 8 మందికి గాయాలు
- లారీని ఢీకొట్టిన బైక్ : యువకుడు దుర్మరణం.. యువతికి తీవ్రగాయాలు
- లోన్ ఫ్రాడ్ కేసు: అహ్మదాబాద్‌లో హైదరాబాదీ అరెస్ట్