బుధవారం 03 జూన్ 2020
Warangal-rural - Feb 21, 2020 , 03:48:52

పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి

పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పట్టణ ప్రగతిని పట్టణ ప్రగతిని ఒక చాలెంజింగ్‌గా తీసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు.

  • నూతన చైర్మన్లు, కౌన్సిలర్లు చాలెంజ్‌గా తీసుకోవాలి
  • చిరువ్యాపారులను ప్రత్యేక స్థలాలకు తరలించాలి
  • రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
  • ఒక్కో వార్డుకు ప్రత్యేక అధికారుల నియామకం: కలెక్టర్‌ హరిత
  • పార్టీలకతీతంగా అభివృద్ధి జరగాలి: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
  • లక్ష్యాలు వంద శాతం పూర్తవ్వాలి: ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
  • కలెక్టరేట్‌లో పట్టణ ప్రగతిపై అవగాహన సదస్సు

శాయంపేట, ఫిబ్రవరి 20 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న పట్టణ ప్రగతిని పట్టణ ప్రగతిని ఒక చాలెంజింగ్‌గా తీసుకోవాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు  సూచించారు. పట్టణంలోని ప్రతి వాడ మెరిసిపోవాలని, ఇందుకు తగ్గట్టుగా మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరంగల్‌రూరల్‌ కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో గురువారం పట్టణప్రగతి కార్యక్రమంపై ఇటీవల ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, కౌన్సిలర్లకు అవగాహన సదస్సును నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ ఎం హరిత, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌  హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ పట్టణ ప్రగతిని కొత్తగా ఎన్నికైన మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు చాలెంజ్‌గా తీసుకుని రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో విజయవంతం చేయాలని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లోని అన్ని వార్డుల్లో ఉన్న డ్రైనేజీలను క్లీన్‌ చేయాలని సూచించారు. ప్రతి వాడలో ఒక చెత్తకుండీని ఏర్పాటు చేయాలన్నారు. చెత్తకుండీలోనే చెత్తను వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. చెత్తకుండీలో కాకుండా ఎక్కడపడితే అక్కడ చెత్తవేసే వారికి జరిమానా వేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ స్థలాల్లో టాయిలెట్స్‌ నిర్మాణం జరగాలన్నారు. 


మున్సిపాలిటీల్లోని చిరు వ్యాపారులకు ప్రత్యేక స్థలాలను చూపించి వారికి అక్కడికి తరలించాలని ఆదేశించారు. పది రోజుల పాటు జరిగే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై అభివృద్ధికి పాటు పడాలని ఆయన పిలుపునిచ్చారు. పట్టణ ప్రగతిలో ఎక్కడా నిర్లక్ష్యం జరగవద్దని ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అందరూ పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. 


logo