మంగళవారం 19 జనవరి 2021
Warangal-rural - Feb 19, 2020 , 03:11:43

ఏడో రోజు రూ.48.05 లక్షలు

ఏడో రోజు రూ.48.05 లక్షలు

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 13: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు కొనసాగుతోంది. హుండీల లెక్కింపులో భాగంగా ఏడో రోజు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం 6 గంటలకు కొనసాగింది. 17 హుండీల్లో రూ.48,05,912 ఆదాయం లభించినట్లు మేడారం ఆలయ ఈవో రాజేంద్రం తెలిపారు. హుండీల లెక్కింపులో భాగంగా తొలిరోజు బుధవారం 64 హుండీలను, గురువారం 65, శుక్రవారం 65, శనివారం 53, ఆదివారం 94, సోమవారం 78, మంగళవారం 17 హుండీలను లెక్కించారు. మేడారం జాతరలోని మొత్తం 494 హుండీల్లో ఇప్పటి వరకు 436 హుండీలను లెక్కించగా రూ. 10,29,92,912 ఆదాయం సమకూరినట్లు ఈవో వెల్లడించారు. తడిసిపోయి ఆరబెట్టిన నోట్లను, చిల్లరను లెక్కించాల్సి ఉందని, హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల్లో ఉన్న నోట్లు, చిల్లర కాకుండా ఉన్న ఇతర వస్తువులను వేరుచేయడం వల్ల మంగళవారం తక్కువ హుండీలను లెక్కించాల్సి వచ్చిందని ఆయన వివరించారు. బుధవారం జరిగే మిగిలిన హుండీల లెక్కింపులో ఆదాయం మరింత పెరుగుతుందని భావిస్తున్నామని రాజేంద్రం పేర్కొన్నారు. భక్తులు సమర్పించిన ఆభరణాలను గురువారం తూకం వేసి లెక్కకడుతామని ఆయన వెల్లడించారు.