టీఆర్ఎస్కు ‘సహకారం’!

(వరంగల్‌రూరల్ జిల్లాప్రతినిధి-నమస్తేతెలంగాణ) సహకార ఎన్నికల్లో విశ్లేషకులు ఊహించినట్లుగానే జిల్లాలో టీఆర్ఎస్ ఘన విజయం నమోదు చేసింది. ఎన్నికలేవైనా గెలుపు టీఆర్ఎస్దేనని మరోసారి నిరూపించింది. టీఆర్ఎస్ మద్దతుతో బరిలో దిగిన అభ్యర్థులు విజయదుందుబి మోగించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘా(పీఏసీఎస్)ల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకుని సొసైటీల్లో గులాబీ జెండా ఎగరవేశారు. జిల్లాలో ఆదివారం 30 పీఏసీఎస్‌ల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరిగితే 29 పీఏసీఎస్‌ల చైర్మన్ పీఠాలను దక్కించుకున్నారు. టీఆర్ఎస్ తిరుగులేని శక్తి అని చాటారు. కేవలం ఒకే ఒక పీఏసీఎస్ చైర్మన్ పీఠం మాత్రమే కాంగ్రెస్ వశమైంది. నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. సహకార ఎన్నికల్లో తమ పార్టీ క్లీన్‌స్వీప్ చేయటంతో టీఆర్ఎస్లో ఆనందం వెల్లివిరుస్తుంది. జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలను కలిసి సంతోషాన్ని పంచుకున్నారు. జిల్లాలో 31 పీఏసీఎస్‌లకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. సంగెం పీఏసీఎస్ పాలకవర్గం పదవీకాలం గడువు వచ్చే ఆగస్టు వరకు ఉండటం వల్ల దీనికి ప్రస్తుతం ఎన్నికలు జరగలేదు.
ఇతర 31 పీఏసీఎస్‌ల్లో సహకార ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్లో జోష్ కనపడింది. టీఆర్ఎస్ మద్దతుతో సహకార ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. చివరకు ఆయా శాసనసభ నియోజకవర్గం పరిధిలోని పీఏసీఎస్‌ల్లో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థులకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించడంపై నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ముఖ్యనేతలతోవిస్తృత చర్చలు జరిపి రైతుల మద్దతు గల అభ్యర్థులను సహకార ఎన్నికల్లో బలపరిచారు. దీంతో ఆయా పీఏసీఎస్ పరిధిలోని ప్రతి ప్రాదేశిక నియోజకవర్గం(టీసీ) నుంచి టీఆర్ఎస్ మద్దతుతో అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్యేలు ప్రతి పీఏసీఎస్‌కు పార్టీ నుంచి ఒక ముఖ్యనేతను ఎన్నికల ఇన్చార్జిగా నియమించారు. వీరికితోడు ఆయా పీఏసీఎస్‌కు కొంతమంది పార్టీ నేతలతో ఎన్నికల కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీ సభ్యులు, బరిలో నిలిచిన అభ్యర్థుల సమన్వయంతో పీఏసీఎస్‌ల టీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జిలు ముందుకు నడిచారు. స్థానిక ఎమ్మెల్యే ప్రణాళిక ప్రకారం టీఆర్ఎస్ మద్దతుదారుల గెలుపుకోసం శ్రమించి ఫలితాలు సాధించారు. ప్రధానంగా టీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన ప్రతి అభ్యర్థి వెనుక స్థానిక ఎమ్మెల్యే వ్యూహం ఉందని చెప్పవచ్చు. సహకార ఎన్నికల్లో ఆయా పీఏసీఎస్ పరిధిలోని టీసీల నుంచి అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం నుంచి మొదలుకుని నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, ఏకగ్రీవ ఎన్నిక, ప్రచారం, పోలింగ్ వరకు జిల్లాలోని ఎమ్మెల్యేలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. శనివారం జరిగిన పోలింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడితో సహకార పోరులో వార్ వన్‌సైడ్ జరిగిందని తేలిపోయింది. టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కొన్ని పీఏసీఎస్‌ల్లో క్లీన్‌స్వీప్ చేయగా రెండింటిలో మినహా ఇతర పీఏసీఎస్‌ల్లో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకోవడానికి అవసరమైన మెజార్టీటీసీల్లో గెలిచారు.
చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక
ఎన్నికల డ్యూల్, నోటిఫికేషన్ ప్రకారం ఫలితాలు వెలువడిన మూడురోజుల్లోగా ఆఫీసు బేరర్ల ఎన్నిక జరగాల్సి ఉంది. అంటే అధికారులు ఆయా పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాలి. దీంతో శనివారం పోలింగ్, కౌంటింగ్, ఫలితాల వెల్లడి అయినందున తెల్లవారి ఆదివారం ఎన్నికల అధికారులు జిల్లాలో 31 పీఏసీఎస్‌ల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నిక నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆయా పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. నామినేషన్ల దాఖలు సమయంలో డైరెక్టర్ల మధ్య గొడవ జరగడంతో నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. మిగతా 30 పీఏసీఎస్‌ల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఆత్మకూరు పీఏసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను, సంగెం మండలంలోని చింతలపల్లి పీఏసీఎస్ వైస్ చైర్మన్ పదవిని మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. ఇతర 29 పీఏసీఎస్‌ల చైర్మన్ పదవులు, 28 పీఏసీఎస్‌ల వైస్ చైర్మన్ పదవులను టీఆర్ఎస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. పాతికేళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న గీసుగొండ మండలంలోని వంచనగిరి పీఏసీఎస్ చైర్మన్ పీఠం ఈసారి టీఆర్ఎస్ వశం కావటం విశేషం.
దీంతో పాటు ఇన్నాళ్లు కాంగ్రెస్‌కు పెట్టనికోటగా ఉన్న అమీనాబాద్ పీఏసీఎస్ చైర్మన్ పీఠం కూడా టీఆర్ఎస్కు దక్కటం మరో స్పెషల్. వంచనగిరి, అమీనాబాద్ సొసైటీలపై గులాబీ జెండా ఎగరడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. ఎన్నిక వాయిద పడిన నర్సంపేట పీఏసీఎస్ చైర్మన్ పీఠంపైనా హాట్ టాపిక్ నడుస్తుంది. 29 పీఏసీఎస్‌ల చైర్మన్ పీఠాలను తమ పార్టీ మద్దతుదారులు కైవసం చేసుకోవడంతో జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. జిల్లాలో ఉన్న నర్సంపేట, పరకాల, వర్ద్దన్నపేట, పాలకుర్తి ని యోజకవర్గాల పరిధిలోని పీఏసీఎస్‌ల చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను గెలుచుకున్న టీఆర్ఎస్ మద్దతుదారులు ఆదివారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, గండ్ర వెంకటరమణారెడ్డిని కలిశారు. పార్టీ మద్దతు ఇచ్చి తమను గెలిపించినందుకు కృతజ్ఞతలు చె ప్పారు. విజేతలకు మ ంత్రితో పాటు ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
తాజావార్తలు
- 'రాహుల్‌గాంధీ మీకు అబద్దాలు చెప్పడానికి సిగ్గనిపించదా..?'
- సీబీఐకి ఊమెన్ చాందీపై లైంగిక దాడి కేసు
- డీఆర్డీవోలో అప్రెంటిస్‌లు
- రెండేళ్ల కూతురికి జడ చిక్కులు తీసిన హీరో
- హ్యాపీ బర్త్ డే పుజారా..
- దేశంలో ఊబకాయులు పెరుగుతున్నారు..
- హైదరాబాద్ నవాబు వారసత్వం కేసును తేల్చండి : సుప్రీం
- ఇదోరకం కల్లు..!
- వచ్చే ఏడాది నౌకాదళం అమ్ములపొదిలోకి INS విక్రాంత్!
- వాట్సాప్ ప్రైవసీ పాలసీ : కేంద్రం ఫైర్