శుక్రవారం 05 జూన్ 2020
Warangal-rural - Feb 16, 2020 , 03:24:49

నేడు ‘క్వాడ్రంట్‌'కు భూమి పూజ

నేడు ‘క్వాడ్రంట్‌'కు భూమి పూజ

 మడికొండ, ఫిబ్రవరి 15: మడికొండ శివారులోని టీఎస్‌ఐఐసీకి చెందిన ఐటీ పార్కులో మరో ఐటీ కంపెనీ క్వాడ్రంట్‌ రిసోర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆదివారం భూమి పూజ జరుగనుంది. ఉదయం 9 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్క ర్‌, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌,  ఎమ్మెల్యేలు అరూరి రమేశ్‌,  చల్లా ధర్మారె డ్డి, కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, కార్పొరేషన్‌ కమిషనర్‌ పమేలా సత్పతి, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, కంపెనీ సీఈవో వంశీరెడ్డి తదితరులు హాజరుకానున్నారు.


logo