గురువారం 21 జనవరి 2021
Warangal-rural - Feb 16, 2020 , 03:20:37

నాలుగో రోజు రూ.1.37 కోట్లు

నాలుగో రోజు రూ.1.37 కోట్లు

వరంగల్‌ కల్చరల్‌, ఫిబ్రవరి 15:  మేడారం సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపు బుధవారం ప్రారంభం కాగా, శనివారం నాలుగో రోజూ కొనసాగింది. హన్మకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో శనివారం అధికారులు 53 హుండీలను లెక్కించారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన లెక్కింపు సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. ఈ సందర్భంగా రూ.1,37,70,000 ఆదాయం వచ్చినట్లు మేడారం ఆలయ ఈవో తమ్మ రాజేంద్రం వెల్లడించారు.  తొలి రోజు  రూ.1,01,50,000, రెండోరోజు  1,91,26,000, మూడో రోజు 2,70,16,000 ఆదాయం వచ్చిందన్నారు. నాలుగో రోజుతో కలుపుకుని మొత్తం రూ.7,00,62,000 ఆదాయం సమకూరినట్లు చెప్పారు. జాతర సమయంలో వర్షం కురిసిన కారణంగా ప్రతి హుండీలో భక్తుల కానుకలు తడిసిపోయాయి. ఈ క్రమంలో కొన్ని నోట్లు తడిసిపోయి ముక్కలవుతున్నాయి. తడిగా ఉన్న నోట్లను వలంటీర్లు గాలికి ఆరబెడుతున్నారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య హుండీల లెక్కింపు కొనసాగుతోంది. logo